Breaking News

డూ ఆర్ డై రైడ్‌.. కట్ చేస్తే! తెలుగు టైటాన్స్ రైడర్ సంచ‌ల‌నం

Published on Wed, 10/29/2025 - 20:56

ప్రో క‌బ‌డ్డీ లీగ్‌-2025లో తెలుగు టైటాన్స్ స్టార్ ఆల్‌రౌండ‌ర్‌ భ‌ర‌త్ హుడా త‌న సూప‌ర్ ఫామ్‌ను కొన‌సాగిస్తున్నాడు. ఢిల్లీ వేదిక‌గా పుణేరి పల్టన్‌తో జరిగిన క్వాలిఫ‌య‌ర్‌-2లో కూడా త‌న రైడింగ్ స్కిల్‌తో అద‌ర‌గొట్టాడు. ఓ డూ ఆర్ డై రైడ్‌లో హుడా అద్భుతం చేశాడు.

ఈ మ్యాచ్ ఫ‌స్ట్ హాఫ్‌లో వ‌రుస‌గా రెండు రైడ్స్‌లో పాయింట్లు రాక‌పోవ‌డంతో టైటాన్స్ డూ ఆర్ డై రైడ్‌ను ఎదుర్కొవాల్సి  వ‌చ్చింది. అవ‌త‌లి ఎండ్‌లో ముగ్గురు పుణేరి ప్లేయ‌ర్లు ఉన్నారు. ఈ స‌మ‌యంలో డూర్ ఆర్ డై రైడ్‌కు వెళ్లిన భ‌ర‌త్ హుడా.. ముగ్గురిని కూడా ట‌చ్ చేసి త‌న ఎండ్‌కు వ‌చ్చేశాడు. దీంతో పుణేరి పల్టన్ ఆలౌటైంది. 

ఒకే దెబ్బకు టైటాన్స్‌కు ఐదు పాయింట్లు వ‌చ్చాయి. సూప‌ర్ టాకిల్ అవ‌కాశమున్న‌ప్ప‌టికి చాకచాక్యంగా భరత్‌ డిఫెండర్ల నుంచి తప్పించుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరలవుతోంది. ఈ మ్యాచ్‌లో భరత్‌  23 రైడ్‌ పాయింట్లు సాధించాడు.

టైటాన్స్‌ ఓటమి..
కాగా క్వాలిఫయర్‌-2లో క్వాలిఫయర్‌-2లో 50-45 తేడాతో టైటాన్స్ ఓట‌మి పాలైంది. దీంతో టోర్నీ నుంచి టైటాన్స్‌ ఇంటిముఖం పట్టింది. భరత్‌ హుడా అద్భుత పోరాటం వృథాగా మిగిలిపోయింది. ఇక శుక్రవారం జరగనున్న ఫైనల్ పోరులో దబాంగ్ ఢిల్లీ, పుణేరి పల్టన్ తలపడనున్నాయి.

 

Videos

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)