Breaking News

IND Vs. PAK: ఇది ఆరంభం మాత్రమే.. మున్ముందు: షాహిన్‌ ఆఫ్రిది వార్నింగ్‌!

Published on Sat, 09/09/2023 - 17:12

Shaheen Afridi Ahead of Indo-Pak Asia Cup 2023 Clash: ‘‘టీమిండియాతో ప్రతి మ్యాచ్‌ దేనికదే ప్రత్యేకం. అభిమానులకు ఇండియా- పాకిస్తాన్‌ మ్యాచ్‌ అంటే పండుగే! నేను కూడా అండర్‌-16 క్రికెట్‌ మొదలుపెట్టక ముందు మిగతా ఫ్యాన్స్‌లాగే మ్యాచ్‌ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూసేవాడిని.

ఇప్పటి వరకు టీమిండియాతో నా బెస్ట్‌ స్పెల్‌ ఇదీ అని స్పెషల్‌గా చెప్పలేను. ఇది కేవలం ఆరంభం మాత్రమే. మున్ముందు సాధించాల్సింది.. అత్యుత్తమంగా చేసి చూపాల్సింది చాలా ఉంది’’ అని పాకిస్తాన్‌ స్టార్‌ పేసర్‌ షాహిన్‌ ఆఫ్రిది అన్నాడు. 

టీనేజ్‌లోనే ఎంట్రీ ఇచ్చి
కాగా 2018లో పాకిస్తాన్‌ తరఫున 18 ఏళ్ల వయసులో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన షాహిన్‌ ఆఫ్రిది.. అద్భుత బౌలింగ్‌తో అందరి దృష్టిని ఆకర్షించారు. అనతికాలంలో జట్టులో కీలక సభ్యుడిగా మారి.. ప్రస్తుతం ప్రధాన పేసర్‌ స్థాయికి చేరుకున్నాడు. 

కెరీర్‌లో మూడు ఫార్మాట్లలో కలిపి మొత్తంగా 252 వికెట్లు పడగొట్టిన షాహిన్‌ ఆఫ్రిది.. ఆసియా కప్‌-2023తో బిజీగా ఉన్నాడు. టీమిండియాతో సెప్టెంబరు 2 నాటి మ్యాచ్‌లో 4 వికెట్లు తీసిన ఆఫ్రిది తదుపరి ఆదివారం మరోసారి భారత్‌తో మ్యాచ్‌లో మెరవాలనే పట్టుదలతో ఉన్నాడు.

అదే మా విజయాలకు కారణం
ఈ వన్డే టోర్నీలో ఇప్పటి వరకు ఏడు వికెట్లు పడగొట్టిన షాహిన్‌.. సహచర పేసర్లు నసీం షా, హ్యారిస్‌ రవూఫ్‌లతో తనకు మంచి అనుబంధం ఉందని చెప్పుకొచ్చాడు. ‘‘జట్టులో మేము పోషించాల్సిన పాత్రలేంటో మాకు తెలుసు.

కొత్త, పాత బంతితో ఎలా మేనేజ్‌ చేసుకోవాలో కూడా అవగాహన ఉంది. హ్యారిస్‌ తన వైవిధ్యమైన పేస్‌తో ‍ప్రభావితం చేయగలడు. ఇక నసీం, నేను ఆరంభంలోనే వికెట్లు తీసి శుభారంభం అందించడంపై ఎక్కువగా దృష్టి సారిస్తాం. 

మా మధ్య ఉన్న సమన్వయమే మా విజయాలకు కారణం’’ అని షాహిన్‌ ఆఫ్రిది పేర్కొన్నాడు. కాగా కొలంబోలో ఆదివారం.. సూపర్‌-4 దశలో భారత్‌- పాకిస్తాన్‌ తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌కు వర్ష సూచన ఉన్న నేపథ్యంలో రిజర్వ్‌ డే కేటాయించారు.

చదవండి: ఆ సిరీస్‌ నాటికి అందుబాటులోకి పంత్‌?; అలాంటి బ్యాటర్‌ కావాలి: రోహిత్‌
రెండోసారి పెళ్లికి సిద్ధమైన షాహిన్‌ ఆఫ్రిది.. ఆరోజే బరాత్‌!

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)