Breaking News

రసెల్‌కు పోల్‌ పొజిషన్‌

Published on Sun, 10/05/2025 - 08:17

సింగపూర్‌: మెర్సిడెస్‌ డ్రైవర్‌ జార్జ్‌ రసెల్‌ ఫార్ములావన్‌ తాజా సీజన్‌లో రెండో సారి పోల్‌ పొజిషన్‌ సాధించాడు. శనివారం జరిగిన సింగపూర్‌ గ్రాండ్‌ప్రి క్వాలిఫయింగ్‌ రేసులో రసెల్‌ అందరికంటే ముందు నిలిచాడు. శుక్రవారం ప్రాక్టీస్‌ సందర్భంగా రసెల్‌ కారు ప్రమాదానికి గురవగా... దాని నుంచి వెంటనే తేరుకున్న మెర్సిడెస్‌ డ్రైవర్‌ క్వాలిఫయింగ్‌ రేసులో వాయువేగంతో దూసుకెళ్లాడు. రసెల్‌ 1 నిమిషం 29.158 సెకన్లలో ల్యాప్‌ను పూర్తి చేసి అగ్ర స్థానం దక్కించుకున్నాడు. 

డిఫెండింగ్‌ చాంపియన్, రెడ్‌బుల్‌ డ్రైవర్‌ మ్యాక్స్‌ వెర్‌స్టాపెన్‌ 1 నిమిషం 29.340 సెకన్లతో రెండో స్థానంలో నిలిచాడు. ఈ ఏడాది జోరు కొనసాగిస్తున్న మెక్‌లారెన్‌ డ్రైవర్లు ఆస్కార్‌ పియాస్ట్రి, లాండో నోరిస్‌ ఈ క్వాలిఫయింగ్‌ రేసులో వెనుకబడిపోయారు. పియాస్ట్రి (1 నిమిషం 29.524 సెకన్లు) మూడో స్థానం దక్కించుకోగా... ఆంటొనెల్లి (1 నిమిషం 29.537 సెకన్లు; మెర్సిడెస్‌) నాలుగో స్థానంలో నిలిచాడు. నోరిస్‌ (1 నిమిషం 29.586 సెకన్లు) ఐదో ‘ప్లేస్‌’ దక్కించుకున్నాడు. ఏడుసార్లు ప్రపంచ చాంపియన్, ఫెరారీ డ్రైవర్‌ లూయిస్‌ హామిల్టన్‌ 1 నిమిషం 29.688 సెకన్లతో ఆరో స్థానానికి పరిమితమయ్యాడు. ఆదివారం జరగనున్న ప్రధాన రేసును రసెల్‌ పోల్‌ పొజిషన్‌ నుంచి ప్రారంభించనున్నాడు.  

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)