Breaking News

Viral Video: మ్యాక్స్‌వెల్‌ అద్భుత విన్యాసం.. క్రికెట్‌ చరిత్రలోనే అత్యుత్తమ క్యాచ్‌

Published on Wed, 01/01/2025 - 17:09

బిగ్‌బాష్‌ లీగ్‌ 2024-25లో మెల్‌బోర్న్‌ స్టార్స్‌ ఆటగాడు గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ అద్భుతమైన విన్యాసం చేశాడు. బ్రిస్బేన్‌ హీట్‌తో ఇవాళ (జనవరి 1) జరుగుతున్న మ్యాచ్‌లో మ్యాక్సీ కళ్లు చెదిరే క్యాచ్‌ పట్టాడు. ఈ క్యాచ్‌ను క్రికెట్‌ చరిత్రలోనే అద్బుతమైన క్యాచ్‌గా అభివర్ణిస్తున్నారు విశ్లేషకులు. ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతుంది. ఈ క్యాచ్‌ను చూసి అభిమానులు ఔరా అంటున్నారు.

పూర్తి వివరాల్లోకి వెళితే.. మెల్‌బోర్న్‌ స్టార్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో బ్రిస్బేన్‌ హీట్‌ తొలుత బ్యాటింగ్‌ చేసింది. ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. మ్యాక్స్‌ బ్రయాంట్‌ (77 నాటౌట్‌) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడి తమ జట్టుకు గౌరవప్రదమైన స్కోర్‌ అందించాడు. బ్రిస్బేన్‌ ఇన్నింగ్స్‌లో బ్రయాంట్‌తో పాటు పాల్‌ వాల్టర్‌ (21), టామ్‌ బాంటన్‌ (13) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. మెల్‌బోర్న్‌ బౌలర్లలో స్టీకిటీ రెండు వికెట్లు పడగొట్టగా.. జోయల్‌ పారిస్‌, పీటర్‌ సిడిల్‌, ఉసామా మిర్‌, డాన్‌ లారెన్స్‌ తలో వికెట్‌ దక్కించుకున్నారు.

ఇన్నింగ్స్‌ 17వ ఓవర్‌ను డాన్‌ లారెన్స్‌ బౌల్‌ చేశాడు. తొలి బంతిని ఎదుర్కొన్న విల్‌ ప్రెస్ట్‌విడ్జ్‌ భారీ షాట్‌ ఆడాడు. ప్రెస్ట్‌విడ్జ్‌ ఈ షాట్‌ ఆడిన విధానం చూస్తే సిక్సర్‌ తప్పదని అంతా అనుకున్నారు. ఇక్కడే మ్యాక్స్‌వెల్‌ మ్యాజిక్‌ చేశాడు. సెకెన్ల వ్యవధిలో సిక్సర్‌ వెళ్తున్న బంతిని అద్భుతమైన క్యాచ్‌గా మలిచాడు. బౌండరీ లైన్‌ వద్ద మ్యాక్స్‌వెల్‌ చేసిన ఈ విన్యాసం చూసి ప్రేక్షకులంతా అవాక్కయ్యారు. సిక్సర్‌కు వెళ్తున్న బంతిని మ్యాక్సీ గాల్లోకి ఎగిరి లోపలికి తోశాడు. ఆతర్వాత క్షణాల్లో బౌండరీ లోపలికి వచ్చి క్యాచ్‌ పట్టుకున్నాడు. ఈ క్యాచ్‌ మాటల్లో వర్ణించలేనిది. కాగా, ఈ మ్యాచ్‌లో మ్యాక్స్‌వెల్‌ ఈ క్యాచ్‌తో పాటు మరో మూడు క్యాచ్‌లు పట్టాడు.

మ్యాచ్‌ విషయానికొస్తే.. 150 పరుగుల సాధారణ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన మెల్‌బోర్న్‌ స్టార్స్‌ 14 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో డాన్‌ లారెన్స్‌, మార్కస్‌ స్టోయినిస్‌ (62) తమ జట్టును గెలుపు వాకిటి వరకు తీసుకెళ్లారు. మరో నాలుగు పరుగులు చేస్తే మెల్‌బోర్న్‌ విజయం సాధిస్తుందనగా బార్ట్‌లెట్‌ విజృంభించాడు. వరుస బంతుల్లో స్టోయినిస్‌, మ్యాక్స్‌వెల్‌లను (0) ఔట్‌ చేశాడు. మొత్తానికి లారెన్స్‌ (64 నాటౌట్‌) బాధ్యతగా ఆడి మెల్‌బోర్న్‌ను విజయతీరాలకు చేర్చాడు. మెల్‌బోర్న్‌ స్టార్స్‌ ఇన్నింగ్స్‌లో బెన్‌ డకెట్‌ డకౌట్‌ కాగా.. థామస్‌ రోజర్స్‌ 6, సామ్‌ హార్పర్‌ 8 పరుగులు చేశారు. బ్రిస్బేన్‌ హీట్‌ బౌలర్లలో​ బార్ట్‌లెట్‌ నాలుగు, స్పెన్సర్‌ జాన్సన్‌ ఓ వికెట్‌ పడగొట్టారు. 
 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)