Breaking News

మాస్టర్‌ అథ్లెట్‌ దివ్యారెడ్డికి బెస్ట్‌ అథ్లెట్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డు

Published on Sun, 12/28/2025 - 07:53

కరీంనగర్‌ స్పోర్ట్స్‌: కరీంనగర్‌లో జరుగుతున్న 12వ మాస్టర్‌ అథ్లెటిక్స్‌ రాష్ట్ర స్థాయి పోటీల్లో భాగంగా బెస్ట్‌ మాస్టర్‌ అథ్లెట్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డును మేడ్చల్‌ జిల్లాకు చెందిన మాస్టర్‌ అథ్లెట్, సాక్షి మీడియా గ్రూప్‌ డైరెక్టర్‌ దివ్యారెడ్డి అందుకున్నారు. స్థానిక అంబేడ్కర్‌ స్టేడియంలో శనివారం ప్రారంభమైన 12వ రాష్ట్ర స్థాయి మాస్టర్‌ అథ్లెటిక్‌ చాంపియన్‌ పోటీల్లో 45ఏళ్ల విభాగంలో 800 మీటర్ల రన్నింగ్‌ను 3.33 నిమిషాల్లో చేరుకుని దివ్యారెడ్డి బంగారు పతకాన్ని సాధించారు. 

కొన్నేళ్లుగా మాస్టర్‌ అథ్లెటిక్స్‌ పోటీల్లో 100, 400, 800 మీటర్ల రన్నింగ్‌ ఈవెంట్లలో పాల్గొంటూ రాష్ట్ర స్థాయి మాస్టర్‌ అథ్లెటిక్‌ పోటీల్లో పతకాలను కైవసం చేసుకొని జాతీయ స్థాయి మాస్టర్‌ అథ్లెటిక్స్‌లో రాణిస్తున్నారు. ఆమెకు జ్ఞాపికతోపాటు బంగారు పతకం, సర్టిఫికెట్‌ను రాష్ట్ర మాస్టర్‌ అథ్లెటిక్‌ సంఘం అధ్యక్షుడు మర్రి లక్ష్మారెడ్డి అందించారు. తెలంగాణ మాస్టర్స్‌ అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ గౌరవ అధ్యక్షుడు దేవేందర్‌ రెడ్డి, కరీంనగర్‌ జిల్లా మాస్టర్‌ అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చాట్ల శ్రీధర్, నీలం లక్ష్మణ్, శాట్స్‌ రిటైర్డ్‌ ఏడీ కళ్యాణి తదితరులు పాల్గొన్నారు.   

Videos

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)