Breaking News

బెన్నెట్ విధ్వంస‌క‌ర సెంచ‌రీ.. ఐర్లాండ్‌ను చిత్తు చేసిన జింబాబ్వే

Published on Sat, 02/15/2025 - 17:23

ఐర్లాండ్‌తో మూడు వ‌న్డేల సిరీస్‌ను జింబాబ్వే విజ‌యంతో ఆరంభించింది. హరారే వేదిక‌గా జరిగిన తొలి వ‌న్డేలో జింబాబ్వే 49 పరుగుల తేడాతో ఐర్లాండ్‌ను ఓడించింది. మొదట జింబాబ్వే నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 299 పరుగులు చేసింది. ఓపెన‌ర్ బ్రియాన్‌ బెనెట్‌ (163 బంతుల్లో 169; 20 ఫోర్లు, 3 సిక్స్‌లు) భారీ సెంచరీతో క‌దంతొక్కాడు. 

ఓపెనర్‌గా బరిలోకి దిగిన బెనెట్‌ చివరి ఓవర్‌ వరకు క్రీజులో నిలిచి జట్టుకు భారీ స్కోరు సాధించి పెట్టాడు. కెప్టెన్‌ క్రెయిగ్‌ ఇర్విన్‌ (61 బంతుల్లో 66; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు)... బెనెట్‌కు చక్కటి సహకారం అందించాడు. వీరిద్దరు ఐర్లాండ్‌ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ పరుగులు రాబట్టారు.

ఏకైక టెస్టులో ఐర్లాండ్‌ చేతిలో పరాజయం పాలైన జింబాబ్వే తొలి వన్డేలో దానికి బదులు తీర్చుకుంది. ఐర్లాండ్‌ బౌలర్లలో మార్క్‌ అడైర్‌ రెండు వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్యఛేదనలో ఐర్లాండ్‌ 46 ఓవర్లలో 250 పరుగులకు ఆలౌటైంది.

కెప్టెన్‌ స్టిర్లింగ్‌ (32), క్యాంపెర్‌ (44), టెక్టర్‌ (39), టకర్‌ (31), డాక్‌రెల్‌ (34), మెక్‌బ్రైన్‌ (32) తలా కొన్ని పరుగులు చేశారు. జింబాబ్వే బౌలర్లలో ముజర్బానీ నాలుగు వికెట్లు, ఎన్‌గరవా మూడు వికెట్లు పడగొట్టారు. బెనెట్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య ఆదివారం రెండో వన్డే జరగనుంది.
చదవండి: ENG vs IND: రోహిత్ శ‌ర్మకు బిగ్‌ షాక్‌.. టీమిండియా కెప్టెన్‌గా స్టార్‌ ప్లేయర్‌?
 

#

Tags : 1

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)