Breaking News

ఆర్సీబీ ఫ్యాన్స్‌కు ఉచిత ప్ర‌యాణం.. ఆటో డ్రైవ‌ర్ మంచి మ‌న‌సు

Published on Thu, 04/03/2025 - 17:52

ఐపీఎల్ ఫ్రాంచైజీ రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరుకు ఉన్న ఫ్యాన్ బేస్ గురుంచి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఐపీఎల్ మొద‌లైదంటే ఈ సారి క‌ప్ న‌మ్‌దే అంటూ అభిమానులు చేసే హంగామా ఎంత అంత కాదు. క‌నీసం 18వ సీజ‌న్‌లోనైనా త‌మ ఆరాధ్య జ‌ట్టు కొట్టాల‌ని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఈ క్ర‌మంలో బెంగ‌ళూరుకు చెందిన ఓ ఆటోడ్రైవ‌ర్ ఆర్సీబీ త‌న  అభిమానాన్ని ప్ర‌త్యేకంగా చాటుకున్నాడు.

అజ్మల్ సుల్తాన్ అనే ఆటో డ్రైవ‌ర్ ఆర్సీబీ జెర్సీ ధ‌రించిన వారికి ఉచిత ప్ర‌యాణం క‌ల్పిస్తానని ప్ర‌క‌టించాడు. ఆర్సీబీ జెర్సీ ధ‌రించి ఉంటే రైడ్ ఫ్రీ అని త‌న ఆటో వెన‌క అజ్మల్ రాసుకొచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల‌వుతోంది. అభిమానం అంటే ఇదే నీదేనే అన్నా అని నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు.

ఇక ఐపీఎల్-2025 సీజ‌న్‌లో ఆర్సీబీ అద్బుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రుస్తోంది. త‌మ తొలి రెండు మ్యాచ్‌ల్లో ఘ‌న విజ‌యాలు అందుకున్న బెంగ‌ళూరు జట్టు.. బుధవారం త‌మ సొంత‌మైదానంలో గుజ‌రాత్ టైటాన్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో మాత్రం ఓట‌మి పాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 8 వికెట్ల న‌ష్టానికి 169 ప‌రుగులు చేసింది. ఆర్సీబీ బ్యాట‌ర్ల‌లో లివింగ్ స్టోన్‌(54) టాప్ స్కోర‌ర్‌గా నిల‌వ‌గా.. జితేష్ శ‌ర్మ‌(33), టిమ్ డేవిడ్‌(32) రాణించారు.

గుజ‌రాత్ బౌల‌ర్ల‌లో సిరాజ్ మూడు వికెట్ల‌తో స‌త్తాచాటాడు. అత‌డితో పాటు సాయికిషోర్ రెండు, అర్ష‌ద్‌, ప్ర‌సిద్ద్‌, ఇషాంత్ త‌లా వికెట్ సాధించారు. అనంత‌రం 170 ప‌రుగుల ల‌క్ష్యాన్ని గుజ‌రాత్ కేవ‌లం రెండు వికెట్లు మాత్ర‌మే కోల్పోయి 17.5 ఓవ‌ర్ల‌లో చేధించింది. జోస్ బ‌ట్ల‌ర్‌(73) ఆజేయ హాఫ్ సెంచ‌రీతో చెల‌రేగ‌గా.. సాయిసుద‌ర్శ‌న్‌(49) అద్భుత‌మైన ఇన్నింగ్స్ ఆడాడు. ఆర్సీబీ త‌మ త‌దుప‌రి మ్యాచ్‌లో ఏప్రిల్ 7న ముంబై ఇండియ‌న్స్‌తో త‌ల‌ప‌డ‌నుంది.
చ‌ద‌వండి: SRH: వాళ్లిద్దరు కలిసి 217 పరుగులు ఇచ్చారు.. ఇలా అయితే కష్టమే: భారత మాజీ క్రికెటర్‌

 

Videos

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)