Breaking News

హైదరాబాద్‌ X బెంగాల్‌

Published on Sat, 02/01/2025 - 03:56

రూర్కేలా: హాకీ ఇండియా లీగ్‌ (హెచ్‌ఐఎల్‌)లో హైదరాబాద్‌ తూఫాన్స్, ష్రాచీ రార్‌ బెంగాల్‌ టైగర్స్‌ జట్లు ఫైనల్‌కు దూసుకెళ్లాయి. శుక్రవారం జరిగిన సెమీ ఫైనల్లో హైదరాబాద్‌ తూఫాన్స్‌ 3–1 గోల్స్‌ తేడాతో సూర్మా హాకీ క్లబ్‌పై విజయం సాధించగా... హోరాహోరీగా సాగిన పోరులో ష్రాచీ రార్‌ బెంగాల్‌ టైగర్స్‌ షూటౌట్‌లో తమిళనాడు డ్రాగన్స్‌పై గెలుపొందింది. హైదరాబాద్‌ జట్టు తరఫున అమన్‌దీప్‌ లక్రా (25వ నిమిషంలో), జాకబ్‌ అండర్సన్‌ (35వ నిమిషంలో), నీలకంఠ శర్మ (43వ నిమిషంలో) తలా ఒక గోల్‌ చేశారు. 

సూర్మ హాకీ క్లబ్‌ తరఫున మ్యాచ్‌ చివరి నిమిషంలో జెరెమీ హెవార్డ్‌ (60వ ని.లో) ఏకైక గోల్‌ కొట్టాడు. మ్యాచ్‌ ఆరంభం నుంచి పూర్తి ఆధిపత్యం కనబర్చిన హైదరాబాద్‌ తూఫాన్స్‌ ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా చెలరేగింది. ఇక బెంగాల్‌ టైగర్స్, తమిళనాడు డ్రాగన్స్‌ మధ్య తీవ్ర ఉత్కంఠ భరితంగా సాగిన మరో సెమీస్‌లో నిర్ణీత సమయంలో ఇరు జట్లు 2–2 గోల్స్‌తో సమంగా నిలిచాయి. 

బెంగాల్‌ టైగర్స్‌ తరఫున ప్రదీప్‌ సింగ్‌ సంధు (30వ నిమిషంలో), స్యామ్‌ లేన్‌ (53వ ని.లో) చెరో గోల్‌ చేయగా... డ్రాగన్స్‌ తరఫున నాథన్‌ ఎప్రామ్స్‌ (18వ ని.లో), సెల్వం కార్తి (32వ ని.లో) ఒక్కో గోల్‌ కొట్టారు. దీంతో ఫలితం తేల్చేందుకు షూటౌట్‌ నిర్వహించగా... బెంగాల్‌ టైగర్స్‌ జట్టు ‘సడెన్‌ డెత్‌’లో 6–5 గోల్స్‌ తేడాతో తమిళనాడు డ్రాగన్స్‌ పై గెలిచింది. ఆదివారం జరగనున్న తుది పోరులో బెంగాల్‌ టైగర్స్‌తో హైదరాబాద్‌ తూఫాన్స్‌ టైటిల్‌ కోసం పోటీ పడనుంది. 

Videos

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)