Breaking News

ముంబై ఇండియన్స్‌లోకి బెన్‌ స్టోక్స్‌

Published on Wed, 08/14/2024 - 16:46

సౌతాఫ్రికా టీ20 లీగ్‌ 2025 ఎడిషన్‌ కోసం ఎంపిక చేసిన ముంబై ఇండియన్స్‌ కేప్‌టౌన్‌ జట్టుకు ఇంగ్లండ్‌ టెస్ట్‌ జట్టు కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌ ఎంపికయ్యాడు. స్టోక్స్‌తో పాటు ఆఫ్ఘనిస్తాన్‌ ఆల్‌రౌండర్‌ అజ్మతుల్లా ఒమర్‌జాయ్‌ను కూడా ఎంపిక చేసుకుంది ఎంఐ కేప్‌టౌన్‌ యాజమాన్యం. ఈ జట్టులో రషీద్‌ ఖాన్‌, ట్రెంట్‌ బౌల్ట్‌, కగిసో రబాడ, రస్సీ వాన్‌ వర్‌ డస్సెన్‌, డెవాల్డ్‌ బ్రెవిస్‌, నువాన్‌ తషార లాంటి ఇంటర్నేషనల్‌ స్టార్స్‌ ఉన్నారు. 

14 మంది సభ్యుల​ జట్టును ఎంఐ కేప్‌టౌన్‌ యాజమాన్యం ఇవాళ (ఆగస్ట్‌ 14) ప్రకటించింది. కాగా, బెన్‌ స్టోక్స్‌ తాజాగా హండ్రెడ్‌ లీగ్‌ ఆడుతూ గాయపడిన విషయం తెలిసిందే. తొడ కండరాలు పట్టేయడంతో స్టోక్స్‌ శ్రీలంకతో టెస్ట్‌ సిరీస్‌కు కూడా దూరమయ్యాడు.

ఇదిలా ఉంటే, ఆరు ఫ్రాంచైజీలు పాల్గొనే సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో ఇప్పటివరకు రెండు ఎడిషన్లు జరిగాయి. రెండు ఎడిషన్లలో సన్‌రైజర్స్‌ ఈస్ట్రన్‌కేప్‌ ఫ్రాంచైజీనే విజేతగా నిలిచింది. ఎస్‌ఏ20 2025 సీజన్‌ వచ్చే ఏడాది జనవరి 9న మొదలై ఫిబ్రవరి 8న జరిగే ఫైనల్‌తో ముగుస్తుంది. ఈ లీగ్‌లో సన్‌రైజర్స్‌ ఈస్ట్రన్‌కేప్‌తో పాటు ఎంఐ కేప్‌టౌన్‌, డర్బన్‌ సూపర్‌ జెయింట్స్‌, జోబర్గ్‌ సూపర్‌ కింగ్స్‌, పార్ల్‌ రాయల్స్‌, ప్రిటోరియా క్యాపిటల్స్‌ ఫ్రాంచైజీలు పాల్గొంటాయి.

ఎస్‌ఏ20 2025 ఎడిషన్‌ కోసం ఎంఐ కేప్‌టౌన్‌ జట్టు..
బెన్‌ స్టోక్స్‌, రషీద్‌ ఖాన్‌, ట్రెంట్‌ బౌల్ట్‌, అజ్మతుల్లా ఒమర్‌జాయ్‌, నువాన్‌ తుషార, క్రిస్‌ బెంజమిన్‌, కగిసో రబాడ, డెవాల్డ్‌ బ్రెవిస్‌, రస్సీ వాన్‌ డర్‌ డస్సెన్‌, ర్యాన్‌ రికెల్టన్‌, జార్జ్‌ లిండే, డెలానో పాట్‌గెయిటర్‌, థామస్‌ కేబర్‌, కానర్‌ ఎస్టర్‌హ్యుజెన్‌
 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)