Breaking News

సీఎస్‌కేలోకి బెన్‌ డకెట్‌..!

Published on Sun, 08/03/2025 - 16:34

వచ్చే ఐపీఎల్‌ సీజన్‌ (2026) కోసం ఫైవ్‌ టైమ్‌ ఛాంపియన్స్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌ భారీ మార్పులు చేసే అవకాశం ఉంది. గడిచిన సీజన్‌లో ఆ జట్టు పేలవ ప్రదర్శన కనబర్చి పాయింట్ల పట్టికలో చిట్టచివరి స్థానంలో (14 మ్యాచ్‌ల్లో కేవలం నాలుగే విజయాలు) నిలిచింది. ఈ కారణంగానే సీఎస్‌కే యాజమాన్యం భారీ ప్రక్షాళన చేపట్టే అవకాశం ఉంది.

ఈ క్రమంలో సీఎస్‌కే ఓ కీలక ఆటగాడిగాని జట్టులో చేర్చుకోవచ్చని తెలుస్తుంది. ఇంగ్లండ్‌ బజ్‌బాల్‌ టెక్నిక్‌లో భాగమైన బెన్‌ డకెట్‌పై సీఎస్‌కే కన్నేసినట్లు తెలుస్తుంది. డకెట్‌ను జట్టులో చేర్చకోవడం వల్ల సీఎస్‌కే అనేక ప్రయోజనాలు పొందే అవకాశం ఉంటుంది.

గత సీజన్‌లో సీఎస్‌కేకు సరైన ఓపెనింగ్‌ బ్యాటర్‌ లేక పవర్‌ప్లేల్లో తేలిపోయింది. ఆ జట్టుకు ఒక్క​ మ్యాచ్‌లో కూడా మెరుపు ఆరంభం లభించలేదు. సీఎస్‌కే గత సీజన్‌ మొత్తం ఓపెనర్లతో ప్రయోగాలు చేసింది. రచిన్‌ రవీంద్ర, రాహుల్‌ త్రిపాఠి, డెవాన్‌ కాన్వే, షేక్‌ రషీద్‌, ఆయుశ్‌ మాత్రేతో రకరకాల కాంబినేషన్లతో ప్రయోగాలు చేసిన సత్ఫలితాలు రాలేదు. 

డకెట్‌ ఆ జట్ట పవర్‌ప్లే కష్టాలకు సరైన పరిష్కారం కావచ్చు. డకెట్‌కు పవర్‌ప్లేల్లో మంచి రికార్డు ఉంది. దూకుడైన ఆటతీరుతో అతను ప్రాతినిథ్యం వహించిన జట్లకు మెరుపు ఆరంభాలను అందించాడు. టీ20ల్లో డకెట్‌కు 140కు పైగా స్ట్రయిక్‌రేట్‌ ఉంది. పవర్‌ప్లేల్లోనే కాకుండా క్రీజ్‌లో కుదురుకుంటే ఇన్నింగ్స్‌ మొత్తం దడదడలాడించేస్తాడు డకెట్‌.

గత సీజన్‌లో సీఎస్‌కే ఎదుర్కొన్న మరో కీలకమైన సమస్య స్పిన్‌ బౌలింగ్‌ను ఎదుర్కోవడం. ఈ సమస్యకు కూడా డకెట్‌ సరైన పరిష్కారం​ కావచ్చు. డకెట్‌కు స్పిన్నర్లపైన మంచి ట్రాక్‌ రికార్డు ఉంది. అతడికున్న అద్బుతమైన టెక్నిక్‌తో స్పిన్నర్లకు ఎడాపెడా వాయించేస్తాడు. 

స్పిన్నర్లపై అతని స్వీప్‌ షాట్లు, ముఖ్యంగా రివర్స్‌ స్వీప్‌లు అమితంగా ఆకట్టుకుంటాయి. పై కారణాలకు పరిష్కారం దిశగా సీఎస్‌కే వచ్చే సీజన్‌ కోసం​ డకెట్‌ను తప్పక కొనుగోలు చేస్తుందని టాక్‌ నడుస్తుంది. ఫార్మాట్లకతీతంగా చెలరేగిపోయే 30 ఏళ్ల డకెట్‌ ప్రస్తుతం భారత్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌లో సత్తా చాటుతున్నాడు. మెరుపు బ్యాటింగ్‌తో అతడు ఈ సిరీస్‌లో ఇంగ్లండ్‌కు తురుపుముక్కగా ఉన్నాడు.  

 

#

Tags : 1

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)