Breaking News

అది అతని వ్యక్తిగత నిర్ణయం

Published on Fri, 05/09/2025 - 01:02

న్యూఢిల్లీ: భారత విజయవంతమైన కెప్టెన్, ‘హిట్‌మ్యాన్‌’ రోహిత్‌ శర్మ రిటైర్మెంట్‌ నిర్ణయం పూర్తిగా అతని వ్యక్తిగతమని  బోర్డు సీనియర్‌ ఉపాధ్యక్షుడు రాజీవ్‌ శుక్లా తెలిపారు. వచ్చే నెలలో ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల ద్వైపాక్షిక సిరీస్‌కు ముందు రోహిత్‌ బుధవారం అనూహ్యంగా సంద్రదాయ టెస్టు ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పాడు. ఇది భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ)తో పాటు క్రికెట్‌ అభిమానుల్ని నిర్ఘాంతపరిచింది. సీనియర్‌ క్రికెటర్, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ సారథి రహానే సైతం రోహిత్‌ నిర్ణయం షాక్‌కు గురి చేసిందని వ్యాఖ్యానించాడు. 

‘హిట్‌మ్యాన్‌’ టెస్టులకు రిటైర్మెంట్‌ ప్రకటించడంపై శుక్లా స్పందించారు. ‘అది పూర్తిగా అతని వ్యక్తిగత నిర్ణయం. ఇందులో బోర్డు పాత్ర ఏమీ లేదు. బోర్డు పాలసీ ప్రకారం ఎవరైనా ఆటగాడు ఆటకు వీడ్కోలు పలికితే... ఆ నిర్ణయం సవరించుకునేలా ఒత్తిడి చేయం. అలాగే ఎలాంటి సూచన గానీ, సంప్రదింపులు గానీ జరపం’ అని అన్నారు. అయితే సుదీర్ఘ కాలం ఆటగాడిగా, సారథిగా భారత క్రికెట్‌ అతను అందించిన సేవల్ని కొనియాడుతామన్నారు. ‘రోహిత్‌ ముమ్మాటికీ గొప్ప బ్యాటర్‌. 

అతను వన్డే క్రికెట్‌లో కొనసాగుతానని చెప్పడం ఇందులో సానుకూలాంశం.కాబట్టి అతని విశేషానుభవం, అసాధారణ ప్రదర్శన భారత వన్డే జట్టుకు బాగా ఉపయోగపడుతుంది’ అని శుక్లా అన్నారు. టెస్టుల్లో టీమిండియా తదుపరి సారథి ఎవరనేదానిపై సీనియర్‌ పేసర్‌ బుమ్రా సహా, బ్యాటర్లు కేఎల్‌ రాహుల్, శుబ్‌మన్‌ గిల్‌ల పేర్లు వినిపిస్తున్నప్పటికీ శుక్లా వీటిని కొట్టిపారేశారు. రోహిత్‌ వారసుడి ఎంపిక సెలక్షన్‌ కమిటీ చూసుకుంటుందని స్పష్టం చేశారు.  

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)