Breaking News

ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌.. పంత్‌ దూరం! ఆంధ్రా ఆటగాడు అరంగేట్రం..

Published on Mon, 01/02/2023 - 20:03

టీమిండియా స్టార్‌ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ రిషబ్‌ పంత్‌ కారు ప్రమాదంలో గాయపడిన సంగతి తెలిసిందే. అతడు ప్రస్తుతం డెహ్రాడూన్‌లోని మ్యాక్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. రిషబ్‌ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉంది. అయితే అతడు పూర్తి స్థాయిగా కోలుకోవడానికి దాదాపు ఆరు నెలల సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలో పంత్‌ స్వదేశంలో ఆస్ట్రేలియాతో కీలకమైన టెస్టు సిరీస్‌కు దూరం కావడం దాదాపు ఖాయమనిపిస్తోంది. దీంతో ఆంధ్రా వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ కోన శ్రీకర్‌ భరత్‌ టెస్టుల్లో భారత్‌ తరపున అరంగేట్రం చేయనున్నట్లు సమాచారం. అదే విధంగా ఆస్ట్రేలియా సిరీస్‌ సమయానికి సిద్దంగా ఉండాలని భరత్‌కు బీసీసీఐ కూడా తెలియజేసినట్లు తెలుస్తోంది.

గత కొంత కాలంగా భారత జట్టుకు భరత్‌ ఎంపిక అవుతున్నప్పటికీ.. కేవలం బ్యాకప్‌ వికెట్‌ కీపర్‌గా మాత్రమే ఉండిపోయాడు. 2021లో  న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో భరత్‌కు తొలి సారిగా భారత జట్టులో చోటు దక్కింది. అయితే తుది జట్టులో మాత్రం చోటు దక్కలేదు. కానీ రెండో టెస్టులో సబ్‌స్ట్యూట్‌గా వచ్చిన భరత్‌.. తన వికెట్‌ కీపింగ్‌ స్కిల్స్‌తో అందరిని అకట్టుకున్నాడు.

అదే విదంగా ఇటీవల బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో కూడా భరత్‌కు  చోటు దక్కింది. కానీ రెండు మ్యాచ్‌లకు కూడా బెంచ్‌కే పరిమితమ్యాడు. ఇక భరత్‌కు దేశీవాళీ క్రికెట్‌లో అద్భుతమైన రికార్డు ఉంది. ప్రస్తుతం జరుగుతున్న రంజీ ట్రోఫీలో కూడా భరత్‌ పర్వాలేదనిపిస్తున్నాడు.

ఇషాన్‌ కిషన్‌ టెస్టు ఎంట్రీ..
బంగ్లాదేశ్‌పై వన్డేల్లో డబుల్‌ సెంచరీ సాధించిన యువ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ ఇషాన్‌ కిషన్‌ టెస్టుల్లో ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌కు భరత్‌కు బ్యాక్‌ఆప్‌ వికెట్‌ కీపర్‌గా కిషన్‌ను ఎంపిక చేయనున్నట్లు సమాచారం. ఈ ఏడాది ఫిబ్రవరి-మార్చిలో స్వదేశంలో భారత జట్టు నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో ఆస్ట్రేలియాతో తలపడనుంది. ఈ సిరీస్‌లో భారత్‌ విజయం సాధిస్తే.. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌ షిప్‌ ఫైనల్‌ బెర్త్‌ను ఖారారు చేసుకుంటుంది.
చదవండి: Rishabh Pant: ఐసీయూ నుంచి ప్రైవేటు గదికి రిషభ్ పంత్‌.. కారణమిదే?

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)