Breaking News

పేరుకే పెద్దన్న.. బీసీసీఐదే సింహభాగం, మరోసారి నిరూపితం

Published on Fri, 07/14/2023 - 12:58

అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌(ఐసీసీ) గురువారం దుబాయ్‌ కేంద్రంగా వార్షిక సభ్య సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో ఐసీసీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఐసీసీ నిర్వహించే మేజర్‌ టోర్నీల్లో ఇకపై పరుషులతో సమానంగా మహిళలకు ప్రైజ్‌మనీ సమానంగా ఉంటుందని పేర్కొంటూ క్రికెట్‌లో కొత్త అధ్యాయానికి తెర తీసింది. 

ఇదిలా ఉంటే ఐసీసీ పెద్దన్న పాత్ర పోషిస్తున్నప్పటికి తెరవెనుక మాత్రం బీసీసీఐ కనుసన్నల్లోనే నడుస్తుందని చెప్పొచ్చు. తాజాగా మరోసారి అది నిరూపితమైంది. ఐసీసీ వార్షిక ఆదాయంలో సింహభాగం బీసీసీఐ పొందనుంది. ఈ కొత్త ఆదాయ పంపిణీ విధానానికి ఐసీసీ ఏకగ్రీవ ఆమోదం తెలిపింది. దీని ప్రకారం వచ్చే నాలుగేళ్లలో ఐసీసీ వార్షికాదాయంలో బీసీసీఐకి 38.4 శాతం వాటా దక్కనుంది. దీని ప్రకారం ఏడాదికి దాదాపు రూ. 1886 కోట్లు బీసీసీఐ ఖజానాలో చేరనున్నాయి. బీసీసీఐ తర్వాత ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు(ఈసీబీ)కి 6.89 శాతం.. క్రికెట్‌ ఆస్ట్రేలియా బోర్డుకు 6.25 శాతం వాటా చెల్లించే అవకాశముంది.

►ప్రపంచవ్యాప్తంగా విపరీతంగా పుట్టుకొస్తున్న ప్రైవేటు టి20 లీగ్‌ టోర్నీలకు.. ఆయా నిర్వాహకులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇకపై టి20 లీగ్‌లో తుదిజట్టులో నలుగురు విదేశీ ఆటగాళ్లను మాత్రమే ఆడించాలని పేర్కొంది. జట్టులో కచ్చితంగా ఏడుగురు స్వదేశీ లేదా అసోసియేట్‌ సభ్య దేశాల ఆటగాళ్లు ఉండాలని చెప్పింది. అయితే ఐపీఎల్‌లో ఇప్పటికే ఈ రూల్‌ అమలవుతున్న సంగతి తెలిసిందే.

► ఇక టెస్టు క్రికెట్‌లో ఓవర్‌రేట్‌ జరిమానా నిబంధనల విషయంలో ఐసీసీ మార్పు చేసింది. నిర్ణీత వ్యవధి ముగిసిన తర్వాత వేసే ఒక్కో ఓవర్‌కు ఆటగాళ్లకు మ్యాచ్‌ ఫీజులో 5 శాతం కోట విధించనున్నట్లు ఐసీసీ పేర్కొంది.

చదవండి: Yashasvi Jaiswal: చరిత్రకు మరో 57 పరుగుల దూరంలో

Equal Prize Money For Cricketers: క్రికెట్‌ చరిత్రలో కొత్త అధ్యాయం.. ప్రైజ్‌మనీలో సమానత్వం

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)