Breaking News

BCCI: ఐపీఎల్‌ మాదిరే మరో టీ20 లీగ్‌? లెజెండ్స్‌ స్పెషల్‌?

Published on Tue, 08/13/2024 - 10:33

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) మాదిరే మరో ఫ్రాంఛైజీ లీగ్‌కు భారత క్రికెట్‌ నియంత్రణ మండలి(బీసీసీఐ) శ్రీకారం చుట్టనుందా?.. వేలం ప్రాతిపదికన ఆటగాళ్లను కొనుగోలు చేసి.. జట్లను ఎంపిక చేసుకునే అవకాశం ఇవ్వనుందా?.. అంటే అవుననే అంటున్నాయి బీసీసీఐ వర్గాలు. అయితే, ఈ టీ20 లీగ్‌ రిటైర్‌ అయిన క్రికెటర్ల కోసమే ప్రత్యేకంగా రూపుదిద్దుకోనుందని సమాచారం.

బీసీసీఐ ఆధ్వర్యంలో 2008లో మొదలైన ఐపీఎల్‌ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన లీగ్‌గా పేరొందింది. ఈ క్యాష్‌ రిచ్‌ లీగ్‌లో ప్రతిభ నిరూపించుకున్న క్రికెటర్లు.. పేరుప్రఖ్యాతులతో పాటు కోట్లాది రూపాయలు సంపాదించుకున్నారు. ఇక టీమిండియా వెటరన్లు సైతం ఈ లీగ్‌ ద్వారా ఇంకా యాక్టివ్‌ క్రికెటర్లుగా కొనసాగుతూ తమలో సత్తా తగ్గలేదని నిరూపించుకుంటున్నారు.

లెజెండ్స్‌ స్పెషల్‌?
అయితే, ఐపీఎల్‌కు కూడా రిటైర్మెంట్‌ ప్రకటించిన ఆటగాళ్లలో కొందరు లెజెండ్స్‌ లీగ్‌ క్రికెట్‌ వంటి పొట్టి ఫార్మాట్‌ టోర్నీల ద్వారా రీఎంట్రీ ఇస్తున్నారు. యువరాజ్‌ సింగ్‌, హర్భజన్‌ సింగ్‌, సురేశ్‌ రైనా, ఇర్ఫాన్‌ పఠాన్‌, యూసఫ్‌ పఠాన్‌ వంటి మాజీలు ఇందులో భాగమవుతున్నారు. అయితే, ఇలా ప్రైవేట్‌ లీగ్‌లలో కాకుండా బీసీసీఐ నేతృత్వంలోని లీగ్‌లో ఆడాలని భారత మాజీ క్రికెటర్లు భావిస్తున్నట్లు సమాచారం.

ఈ క్రమంలో బీసీసీఐ కార్యదర్శి జై షాను కలిసి తమ మనసులో మాటను వెల్లడించినట్లు తెలుస్తోంది. ఈ విషయం గురించి బీసీసీఐ అధికారి ఒకరు దైనిక్‌ జాగరణ్‌తో మాట్లాడుతూ.. ‘‘టీ20 లీగ్‌ నిర్వహణకు సంబంధించి మాజీ క్రికెటర్ల నుంచి ప్రతిపాదన వచ్చింది. ఈ ప్రపోజల్‌ను పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. మేము కూడా సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నాం’’ అని పేర్కొన్నారు.

ఇప్పట్లో సాధ్యం కాకపోవచ్చు
బీసీసీఐ ఇప్పటికే ఐపీఎల్‌తో పాటు మహిళా ప్రీమియర్‌ లీగ్‌(WPL) కూడా నిర్వహిస్తోంది. ఇక ఈసారి ఐపీఎల్‌ మెగా వేలం కూడా జరుగబోతోంది. ఈ నేపథ్యంలో ఈ రెండు లీగ్‌ల నిర్వహణతో పాటు వేలానికి సంబంధించిన పనులతో బీసీసీఐ బిజీగా ఉంది. ఇలాంటి సమయంలో మాజీ క్రికెటర్లు ప్రతిపాదించినట్లుగా లెజెండ్స్‌ లీగ్‌ నిర్వహించడం సాధ్యం కాకపోవచ్చు. 

అయితే, భవిష్యత్తులో మాత్రం ఈ లీగ్‌ మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. కాగా బీసీసీఐతో అన్ని సంబంధాలు తెంచుకున్న క్రికెటర్లు మాత్రమే విదేశీ లీగ్‌లలో ఆడేందుకు అనుమతి ఉంటుందన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్వదేశీ లీగ్‌తోనే మరోసారి సత్తా చాటాలని మాజీలు భావిస్తున్నట్లు తెలుస్తోంది.

చదవండి: అతడే ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌: సౌరవ్‌ గం‍గూలీ

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)