Breaking News

టీమిండియా చీఫ్‌ సెలెక్టర్‌గా అజిత్‌ అగార్కర్‌!

Published on Thu, 06/29/2023 - 11:15

త్వరలోనే భారత జట్టుకు  సరికొత్త చీఫ్‌ సెలెక్టర్‌ వచ్చే అవకాశం కనిపిస్తోంది.  భారత మాజీ పేసర్‌ అజిత్‌ అగార్కర్‌ను సెలక్షన్‌ కమిటీ కొత్త చైర్మన్‌గా నియమించాలని బీసీసీఐ సిద్దమైనట్లు సమాచారం. కాగా గత రెండు సార్లు కూడా ఛీప్‌ సెలక్టర్‌ రేసులో అగార్కర్‌ పేరు వినిపించినప్పటికి.. అతడు ఈ పదవిని చేపట్టేందుకు సుముఖత చూపలేదు.

అయితే ఈ సారి మాత్రం  చీఫ్‌ సెలెక్టర్‌ పదవి చేపట్టేందుకు అజిత్‌ సిద్దంగా ఉన్నట్లు సమాచారం. ఈ విషయాన్ని బీసీసీఐ జూలై మొదటి వారంలో అధికారింగా ప్రకటించే అవకాశం ఉంది. కాగా ఓ ప్రముఖ న్యూస్ ఛానెల్ చేసిన  స్టింగ్ ఆపరేషన్‌లో అప్పటి సెలక్టర్‌గా ఉన్న చేతన్‌ శర్మ భారత జట్టుకు సంబంధించిన కీలక సమాచారం లీక్ చేసి దొరికిపోవడంతో రాజీనామా చేశాడు.

ఈ క్రమంలో చేతన్‌ శర్మ స్థానంలో సెలక్షన్‌ ప్యానల్‌లో సభ్యుడైన శివ్‌సుందర్‌ దాస్‌ను తాత్కాలిక ఛీప్‌ సెలెక్టర్‌గా బీసీసీఐ ఎంపిక చేసింది. అయితే త్వరలో ఆసియాకప్‌, వన్డే ప్రపంచకప్‌ వంటి మెగా ఈవెంట్‌లు జరగనుండంతో పూర్తి స్థాయి ఛీప్‌ సెలెక్టర్‌ను ఎంపిక చేసిన పనిలో బీసీసీఐ పడింది.

ఈ క్రమంలోనే కొత్త చీఫ్‌ సెలెక్టర్‌ పదవి కోసం బీసీసీఐ దరఖాస్తులను ఆహ్వానించింది. ఇందుకు సంబంధించిన ఇంటర్వ్యూలు జూలై 1 నుంచి (శనివారం) ప్రారంభం కానున్నాయి. 
చదవండి: #ICCWorldCup2023: ఐసీసీ వన్డే ప్రపంచకప్‌ క్వాలిఫయర్స్‌.. వెస్టిండీస్‌ కీలక నిర్ణయం!

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)