Breaking News

మీకు కొంచమైనా తెలివి ఉందా? మ్యాచ్ విన్న‌ర్‌ను ప‌క్క‌న పెడ‌తారా?

Published on Sat, 10/04/2025 - 20:33

భార‌త క్రికెట్ జ‌ట్టు ఆక్టోబ‌ర్‌లో ఆస్ట్రేలియా ప‌ర్య‌ట‌న‌కు వెళ్ల‌నుంది. ఈ టూర్‌లో భాగంగా ఆతిథ్య జ‌ట్టుతో టీమిండియా మూడు వ‌న్డేలు, ఐదు టీ20లు సిరీస్‌ల‌లో త‌ల‌ప‌డ‌నుంది. ఈ సిరీస్‌ల‌కు  శ‌నివారం బీసీసీఐ సెల‌క్ష‌న్ క‌మిటీ భార‌త జ‌ట్టును ప్ర‌క‌టించింది. ఈ సంద‌ర్భంగా అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.

టీమిండియా వన్డే కెప్టెన్‌గా రోహిత్ శర్మను తప్పించి యువ ఆటగాడు శుబ్‌మన్ గిల్‌కు పగ్గాలను సెలక్టర్లు అప్పగించారు. అంతేకాకుండా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాను వన్డే జట్టు నుంచి తప్పించారు. ఈ రెండు నిర్ణయాలు అందరిని ఆశ్చర్యపరుస్తున్నాయి.

టీ20లు, టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్‌.. వన్డేల్లో మాత్రం కొనసాగాలని నిర్ణయించుకున్నాడు. కానీ సెలక్టర్లు మాత్రం వన్డే ప్రపంచకప్‌-2027ను దృష్ట్యా నాయకత్వ మార్పు అవసరమంటూ రోహిత్‌పై వేటు వేశారు. దీంతో అతడి అభిమానులు బీసీసీఐపై మండిపడుతున్నారు.

మరోవైపు జడేజాను కూడా జట్టు నుంచి తప్పించడాన్ని క్రికెట్ నిపుణులు తప్పబడుతున్నారు. జడేజా లాంటి మ్యాచ్ విన్నర్‌ను ఎలా పక్కన పెడతారని సెలక్టర్లపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. జడేజాను ఎంపిక చేయకపోవడంపై టీమ్ ప్రకటన సందర్భంగా ఛీప్ సెలక్టర్ అగార్కర్ స్పందించాడు. ఆస్ట్రేలియా కండీషన్స్‌కు జడేజా సరిపోడు అని అతడు చెప్పుకొచ్చాడు.

ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు ఒక ఎడమచేతి వాటం స్పిన్నర్ (స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండ‌ర్‌) మాత్రమే ఎంపిక చేయాలని నిర్ణయించుకున్నాము. ఇద్ద‌రు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్న‌ర్లు ఆడే అవ‌కాశం లేదు. ఆసీస్ పిచ్‌లు అక్ష‌ర్‌కు స‌రిగ్గా స‌రిపోతాయి. అందుకే ర‌వీంద్ర జ‌డేజా బ‌దులుగా అక్ష‌ర్‌ తీసుకున్నాము. 

ర‌వీంద్ర జ‌డేజా ఎల్ల‌ప్పుడూ మా ప్ర‌ణాళిక‌ల‌లో ఉంటాడు. అతడొక అద్భుత‌మైన ఆల్‌రౌండ‌ర్‌. మంచి ఫీల్డ‌ర్ కూడా అని అగార్కర్ పేర్కొన్నాడు. ఏదేమైన‌ప్ప‌టికి జ‌డేజా లాంటి ఆల్‌రౌండర్‌ను ఎంపిక చేయకపోవడం సరైన నిర్ణయం కాదని చాలా మంది అభిప్రాయపడుతున్నారు.

శనివారం వెస్టిండీస్‌తో ముగిసిన తొలి టెస్టులో జడ్డూ మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన కనబరిచాడు. ఓ సెంచరీతో పాటు 4 వికెట్లు పడగొట్టి ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్‌గా నిలిచాడు. కానీ కాసేపటికే ఆసీస్‌ టూర్‌కు చోటు దక్కకపోవడం జడేజాను నిరాశపరిచింది.
చదవండి: అందుకే రోహిత్‌ శర్మపై వేటు.. అప్పటి వరకు రో-కో ఆడటం కష్టమే: అగార్కర్‌

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)