Breaking News

కర్నూల్‌ అమ్మాయికి బంపరాఫర్‌.. బీసీసీఐ సెంట్రల్‌ కాంట్రాక్ట్‌

Published on Fri, 04/28/2023 - 08:49

ముంబై: భారత మహిళల జట్టు తరఫున నిలకడగా రాణిస్తున్న ఇద్దరు ఆంధ్రప్రదేశ్‌ క్రికెటర్లు సబ్బినేని మేఘన, అంజలి శర్వాణిలకు తొలిసారి బీసీసీఐ సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ లభించింది. కొత్తగా ప్రకటించిన జాబితాలో వీరిద్దరికి గ్రేడ్‌ ‘సి’లో చోటు దక్కింది. బ్యాటర్‌ మేఘన ఇప్పటి వరకు భారత్‌ తరఫున 3 వన్డేలు, 17 టి20లు ఆడగా... లెఫ్టార్మ్‌ పేసర్‌ అంజలి 6 టి20ల్లో జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించింది.  కర్నూలు జిల్లా ఆదోని పట్టణానికి చెందిన 25 ఏళ్ల అంజలి ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌తో అంతర్జాతీయ అరంగేంట్రం చేసింది.

ఇక మూడు గ్రేడ్‌లలో కలిపి మొత్తం 17 మందితో బోర్డు వార్షిక కాంట్రాక్ట్‌ జాబితాను ప్రకటించింది. గ్రేడ్‌ ‘ఎ’లో ఇప్పటి వరకు కెపె్టన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్, స్మృతి మంధాన మాత్రమే ఉండగా కొత్తగా ఆల్‌రౌండర్‌ దీప్తి శర్మకు అవకాశం లభించింది. మే 2021 తర్వాత మహిళా క్రికెటర్లకు కాంట్రాక్ట్‌లు ప్రకటించడం ఇదే తొలిసారి.

గత జాబితాలో ఉండి ప్రస్తుతం రిటైర్‌ అయిన మిథాలీ రాజ్, జులన్‌ గోస్వామిలతో పాటు పూనమ్‌ యాదవ్‌ను కూడా తప్పించగా... ‘బి’ గ్రేడ్‌ జాబితాను 10నుంచి ఐదుకు కుదించారు. ప్రస్తుతం జట్టులో కీలకంగా మారిన రేణుకా ఠాకూర్, రిచా ఘోష్‌లకు ప్రమోషన్‌ దక్కగా, పూజ వస్త్రకర్‌ ‘బి’ నుంచి ‘సి’కి పడిపోయింది.  
కాంట్రాక్ట్‌ల జాబితా  
గ్రేడ్‌ ‘ఎ’ (రూ. 50 లక్షలు): హర్మన్‌ప్రీత్‌ కౌర్, స్మృతి మంధాన,  దీప్తి శర్మ. 
గ్రేడ్‌ ‘బి’ (రూ. 30 లక్షలు): రేణుకా ఠాకూర్, జెమీమా రోడ్రిగ్స్, షఫాలీ వర్మ, రిచా ఘోష్, రాజేశ్వరి గైక్వాడ్‌. గ్రేడ్‌ ‘సి’ (రూ. 10 లక్షలు): మేఘనా సింగ్, దేవిక వైద్య, సబ్బినేని మేఘన, అంజలి శర్వాణి, పూజ వస్త్రకర్, స్నేహ్‌ రాణా, రాధా యాదవ్, హర్లీన్‌ డియోల్, యస్తిక భాటియా.
చదవండి
: NZ vs PAK: సెంచరీతో చెలరేగిన ఫఖర్ జమాన్.. న్యూజిలాండ్‌పై పాక్‌ ఘన విజయం

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)