ఐపీఎల్‌లో ఆడనందుకు రివార్డు.. ఆ ముగ్గురికీ బోనస్‌

Published on Mon, 07/03/2023 - 18:54

కాసుల వర్షం కురిపించే ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో భాగం కావాలని ప్రపంచంలో ప్రతీ ఒక్క క్రికెటర్‌ కోరుకుంటాడనడంలో ఎటువంటి సందేహం లేదు. అదే విధంగా ఎంతోమంది అనామకులను క్రికెట్‌ ప్రపంచానికి పరిచయం చేసిన ఘనత కూడా ఐపీఎల్‌కు ఉంది. ఇటువంటి క్యాష్‌రిచ్‌ లీగ్‌లో భాగమయ్యే అవకాశాన్ని ఏ ఆటగాడు వదులుకోవడానికి ఇష్టపడడు.

కానీ బంగ్లాదేశ్‌కు చెందిన ముగ్గురు ఆటగాళ్లు మాత్రం ఐపీఎల్‌ కంటే తమ జాతీయ జట్టుకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ఐపీఎల్‌ ఆఫర్‌ను వదులుకున్న బంగ్లాదేశ్‌ ఆటగాళ్లు షకీబ్‌ అల్‌హసన్‌, లిటన్‌ దాస్‌, టాస్కిన్‌ అహ్మద్‌లకు ఆ దేశ క్రికెట్‌ రివార్డు ప్రకటించింది. ఈ ముగ్గురికీ కలిపి 65 వేల డాలర్లు (దాదాపు 53 లక్షలు) బీసీబీ రివార్డుగా ఇవ్వనుంది.

కాగా ఐపీఎల్ 2023 మినీ వేలంలో బంగ్లా స్టార్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్‌ని బేస్ ప్రైజ్ రూ.1.5 కోట్లకు కొనుగోలు కోల్‌కతా నైట్‌రైడర్స్‌ కొనుగోలు చేసింది. అయితే ఐర్లాండ్‌తో టెస్టు సిరీస్‌ కారణంగా షకీబ్‌ అల్‌హసన్‌ ఐపీఎల్‌-2023 సీజన్‌ మొత్తానికి దూరమయ్యాడు. అదే విధంగా లిటన్‌ దాస్‌ కూడా ఐర్లాండ్‌ సిరీస్‌ కారణంగా ఈ ఏడాది సీజన్‌ ఫస్ట్‌హాఫ్‌లో ఆడలేదు. ఆ తర్వాత ఈ క్యాష్‌రిచ్‌ లీగ్‌లో ఆడేందుకు వచ్చిన కేవలం ఒకే ఒక్క మ్యాచ్‌ ఆడి స్వదేశానికి వెళ్లిపోయాడు.

అతడిని రూ.50 లక్షలకు కేకేఆరే సొంతం చేసుకుంది. మరోవైపు గాయం కారణంగా ఐపీఎల్‌ సెకెండ్‌ హాఫ్‌కు దూరమైన లక్నో ఫాస్ట్‌ బౌలర్‌ స్ధానంలో టాస్కిన్‌ అహ్మద్‌కు ఆ ఫ్రాంచైజీ నుంచి పిలుపు వచ్చిందంట. అయితే బంగ్లా క్రికెట్‌ బోర్డు అనుమతి ఇవ్వకపోవడంతో లక్నో ఆఫర్‌ను టస్కిన్ అహ్మద్‌ తిరష్కరించినట్లు సమాచారం. ఇక వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2023 ఫైనల్‌ని దృష్టిలో పెట్టుకుని కొం‍తమంది ఆస్ట్రేలియా ఆటగాళ్లు కూడా ఈ ఏడాది ఐపీఎల్‌కు దూరమయ్యారు.
చదవండి: ఆ రెండు మ్యాచులు గెలిస్తే.. వరల్డ్ కప్ టీమిండియాదే: సునీల్ గవాస్కర్

Videos

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

Photos

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)