Breaking News

ఐపీఎల్‌ వేలం ఎఫెక్ట్‌.. బౌలర్‌ను విధ్వంసకర బ్యాటర్‌లా మార్చేసింది..!

Published on Wed, 12/20/2023 - 16:24

ఐపీఎల్‌ 2024 వేలంలో తిరస్కరణకు గురైన ఇ‍ద్దరు ఆటగాళ్లు వేలం మరుసటి రోజు ఫ్రాంచైజీలపై తమ అసంతృప్తిని పరోక్షంగా వెల్లగక్కారు. వేలంలో 1.5 కోట్ల విభాగంలో పేర్లు నమోదు చేసుకుని భంగపడ్డ ఇంగ్లండ్‌ ఆటగాళ్లు ఫిలిప్‌ సాల్ట్‌, క్రిస్ జోర్డన్‌లు ఇవాళ జరిగిన వేర్వేరు మ్యాచ్‌ల్లో బ్యాటింగ్‌లో చెలరేగిపోయారు. ఐపీఎల్‌ ఫ్రాంచైజీలు తమను నిర్లక్ష్యం చేశాయని భావించిన ఈ ఇద్దరూ బ్యాట్‌తో విధ్వంసం సృష్టించారు. 

ఇంగ్లండ్‌ ఓపెనర్‌ ఫిలిప్‌ సాల్ట్‌.. వెస్టిండీస్‌తో జరిగిన నాలుగో టీ20లో  విధ్వంసకర శతకంతో (57 బంతుల్లో 119; 7 ఫోర్లు, 10 సిక్సర్లు) విరుచుకుపడగా.. బిగ్‌బాష్‌ లీగ్‌లో హోబర్ట్‌ హరికేన్స్‌కు ఆడుతున్న క్రిస్‌ జోర్డన్‌ 17 బంతుల్లోనే మెరుపు అర్ధశతకంతో (20 బంతుల్లో 59; 6 ఫోర్లు, 5 సిక్సర్లు) చెలరేగిపోయాడు. సాల్ట్‌కు అంతర్జాతీయ టీ20ల్లో ఇది వరుసగా రెండో శతకం కాగా.. జోర్డన్‌, తాను బౌలర్‌ను అన్న విషయాన్ని మరిచిపోయి, బ్యాట్‌తో వీరవిహారం చేశాడు.

వేలం మరుసటి రోజే ఈ ఇద్దరు ఇంగ్లండ్‌ ఆటగాళ్లు బ్యాట్‌తో రెచ్చిపోవడంతో ఫ్రాంచైజీలు ఆలోచనలో పడ్డాయి. వీరిద్దరి విషయంలో తప్పు చేశామని పశ్చాత్తాపపడుతున్నాయి. టీ20 స్పెషలిస్ట్‌లు అయిన సాల్ట్‌, జోర్డన్‌లను పట్టించుకోకపోవడం అన్ని ఫ్రాంచైజీలు చేసిన అతి పెద్ద తప్పిదమని కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అవకాశం ఉంటే ఈ ఇద్దరినీ వచ్చే ఐపీఎల్‌ సీజన్‌లో ఆడించే ప్రయత్నం చేయాలని వారు ఫ్రాంచైజీలకు సూచిస్తున్నారు. 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)