Breaking News

చివరకు వికెట్‌ కీపర్‌ వెర్రిబాగులోడయ్యాడు! 

Published on Wed, 05/24/2023 - 18:08

క్రికెట్‌లో రనౌట్స్‌ ఒక్కోసారి నవ్వులు పూయిస్తాయి. అది వికెట్‌ కీపర్‌ లేదా బ్యాటర్‌ లేదా ఫీల్డర్‌ కావొచ్చు.. తాము చేసే చిన్న తప్పు జట్టుకు నష్టం తెచ్చినప్పటికి మనకు మాత్రం ఫన్‌ కలిగిస్తోంది. తాజాగా ఒక క్లబ్‌ క్రికెట్‌ సందర్భంగా వికెట్‌ కీపర్‌ తెలివితక్కువ పనితో నవ్వులపాలయ్యాడు.

విషయంలోకి వెళితే.. మ్యాచ్‌లో స్ట్రైక్‌ ఎండ్‌లో ఉ‍న్న బ్యాటర్‌ లాంగాఫ్‌ దిశగా ఆడి రెండు పరుగులు తీసేందుకు యత్నించాడు. సింగిల్‌ పూర్తి చేసి రెండో పరుగు కోసం పరిగెత్తాడు. కానీ నాన్‌స్ట్రైక్‌ ఎండ్‌లో ఉన్న బ్యాటర్‌ నుంచి స్పందన రాకపోవడంతో అప్పటికే స్ట్రైక్‌ ఎండ్‌ నుంచి మిడిల్‌ పిచ్‌లోకి వచ్చేసిన బ్యాటర్‌ ఆగ్రహానికి లోనయ్యాడు. అప్పటికే బంతిని అందుకున్న వికెట్‌కీపర్‌కు ఈజీగా రనౌట్‌ చేసే చాన్స్‌ వచ్చింది.

అలా చేయకుండా బ్యాటర్లు గొడవపడుతుండడాన్ని ఎంజాయ్‌ చేస్తూ అసలు విషయం మరిచిపోయాడు. తాను ఔట్‌ అయ్యాననుకొని స్ట్రైక్‌ ఎండ్‌లో ఉన్న బ్యాటర్‌ పెవిలియన్‌కు వెళ్తూ కీపర్‌ బెయిల్స్‌ పడగొట్టకపోవడం గమనించాడు. అయితే కీపర్‌ మాత్రం తాను బెయిల్స్‌ ఎగురగొట్టాననే భ్రమలో బౌలర్‌ దగ్గరకి వెళ్లి సెలబ్రేట్‌ చేసుకున్నాడు.

కానీ బ్యాటర్‌ క్రీజులోకి చేరుకొని ఇంకా బెయిల్స్‌ పడగొట్టలేదు నేను ఔట్‌ కాదు అంటూ అంపైర్‌కు బ్యాట్‌ చూపించాడు. రూల్‌ ప్రకారం బెయిల్స్‌ కింద పడేస్తేనే రనౌట్‌ అయినట్లుగా పరిగణిస్తారు. దీంతో తనను ఔట్‌ చేయనందుకు సదరు బ్యాటర్‌ కీపర్‌కు థాంక్యూ చెప్పడం విశేషం. తన చర్యకు నాలుక్కరుచుకున్న కీపర్‌ ఏం చేయలేక బంతిని బౌలింగ్‌ ఎండ్‌కు విసిరేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

చదవండి: 'కావాలని మాత్రం కాదు.. మనసులో ఏదో గట్టిగా పెట్టుకొనే!'

Videos

అసలు గేమ్ ఇదేనా..? అడ్డంగా దొరికిపోయింది.. ఇక నందన చాప్టర్ క్లోజ్!

AlphaGeo: డేంజర్ జోన్ లో హైదరాబాద్.. ప్రకృతి వార్నింగ్

YS జగన్ పాదయాత్ర డేట్ ఫిక్స్

వివేకా కేసులో వీడిన మిస్టరీ...? కారుమూరి సంచలన వ్యాఖ్యలు

తెలియదు.. గుర్తులేదు.. మర్చిపోయా.. పోలీసులకు సాదిక్ ఖాన్ సమాధానాలు?

Paradise: ఆ పాట లేకుండానే రిలీజ్.?

2029.. ఏ ఒక్కడిని వదిలిపెట్టను... అనిల్ కుమార్ యాదవ్ మాస్ వార్నింగ్

మజ్జి శ్రీనివాసరావు TDPలో చేరికపై కొండ రాజీవ్ స్ట్రాంగ్ రియాక్షన్

యూకేలో అల్లకల్లోలం.. వెయ్యికి పైగా విమానాలు రద్దు..

అక్క స్కెచ్ అదిరిందిగా! బిగ్ బాస్ లోకి రమానందన వైల్డ్ కార్డ్ ఎంట్రీ?

Photos

+5

సింపుల్ లుక్‌లో స్టన్నింగ్ బ్యూటీ.. శ్రీనిధి శెట్టి (ఫొటోలు)

+5

భార్యతో సుకుమార్.. 80s రెట్రో లుక్‌లో అదిరిపోయే.. (ఫొటోలు)

+5

రష్మిక పాత ఫొటోలు.. క్యూట్‌నెస్‌కు ఫిదా అవ్వాల్సిందే (ఫోటోలు)

+5

భార్య ప్రేమలో నాగశౌర్య.. క్యూట్‌ మూమెంట్స్‌ (ఫొటోలు)

+5

ఓయూలో ఘనంగా 85వ స్నాతకోత్సవం (ఫోటోలు)

+5

‘ఎపిక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. (ఫొటోలు)

+5

దువాతో రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకొణె.. వైరల్‌గా ఫ్యామిలీ (ఫొటోలు)

+5

అందాల ఆషిక.. చీరలో ఆకట్టుకుందిలా..(ఫొటోలు)

+5

అబు జాని 40 సంవత్సరాల ఈవెంట్‌...మెరిసిన ప్రముఖులు (ఫొటోలు)

+5

‘ఎపిక్ ’మూవీ.. హీరోయిన్ వైష్ణవి చైతన్య (ఫొటోలు)