Breaking News

పిచ్‌ మధ్యలోకి వచ్చి నిద్రపోతున్నావా? నడవడానికి ఇబ్బందిగా ఉంటే ఆడడం ఎందుకు?

Published on Sat, 06/24/2023 - 13:45

యూరోపియన్‌ క్రికెట్‌ గేమ్‌లో సీరియస్‌నెస్‌ చాలా తక్కువగా కనిపిస్తోంది. నిర్లక్ష్యంగా వికెట్‌లు పారేసుకోవడం ఇక్కడ మాత్రమే చూస్తుంటాం. పరుగులు తీయడానికి ఇబ్బందులు పడుతూ అనవసరంగా రనౌట్‌ అయిన దాఖలాలు చాలానే ఉన్నాయి. తాజాగా అలాంటి ఫన్నీ ఘటనే మరోసారి చోటుచేసుకుంది. రనౌట్‌ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకునే చాన్స్‌ ఉన్నా బద్దకానికి బ్రాండ్‌ అంబాసిడర్‌ అయినట్లు పరిగెత్తడానికే ఇష్టపడని ఒక బ్యాటర్‌ చేతులు కాల్చుకున్నాడు.

విషయంలోకి వెళితే.. బౌలర్‌ వేసిన బంతిని బ్యాటర్‌ లెగ్‌సైడ్‌ దిశగా ఆడి సింగిల్‌ కంప్లీట్‌ చేశాడు. ఫీల్డర్‌ బంతి అందుకొని కీపర్‌కు త్రో వేశాడు. అప్పటికే సింగిల్‌ పూర్తి చేసిన స్ట్రైకింగ్‌ బ్యాటర్‌ రెండో పరుగు వద్దని సిగ్నల్‌ ఇచ్చాడు. ఇది గమనించని నాన్‌స్ట్రైక్‌ ఎండ్‌ బ్యాటర్‌ ముందుకు వచ్చాడు. కానీ అప్పటికి వెనక్కి వెళ్లే అవకాశం ఉంది. కానీ నడవడానికి కూడా ఇబ్బంది పడినట్లుగా ఏం జరగదులే అన్నట్లుగా మెళ్లిగా వెళ్లాడు. ఇదే చాన్స్‌గా భావించిన కీపర్‌ నేరుగా నాన్‌స్ట్రైక్‌ ఎండ్‌వైపు డైరెక్ట్‌ త్రో వేయడం.. బ్యాటర్‌ క్రీజులోకి రాకముందే వికెట్లు ఎగిరిపడ్డాయి. ఇంకేముంది సదరు బ్యాటర్‌గారూ చేసేదేం లేక పెవిలియన్‌కు వెళ్లిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇది చూసిన అభిమానులు.. ''ఎక్కడలేని వింతలన్నీ యూరోపియన్‌ క్రికెట్‌లోనే జరుగుతుంటాయి''.. ''నడవడానికి ఇబ్బందిగా ఉంటే క్రికెట్‌ ఆడడం ఎందుకు.. కనీసం ఫిట్‌నెస్‌ కూడా లేదు.. ''పిచ్‌ మధ్యలోకి వచ్చి నిద్రపోతున్నావా'' అంటూ కామెంట్స్‌తో రెచ్చిపోయారు.

చదవండి: వందకు పైగా టెస్టులు ఆడాడు.. మీరు ఇచ్చే గౌరవం ఇదేనా?

'ఐదేళ్ల క్రితమే చెప్పాడు'.. వార్న్‌ బతికుంటే సంతోషించేవాడు

Videos

అసలు గేమ్ ఇదేనా..? అడ్డంగా దొరికిపోయింది.. ఇక నందన చాప్టర్ క్లోజ్!

AlphaGeo: డేంజర్ జోన్ లో హైదరాబాద్.. ప్రకృతి వార్నింగ్

YS జగన్ పాదయాత్ర డేట్ ఫిక్స్

వివేకా కేసులో వీడిన మిస్టరీ...? కారుమూరి సంచలన వ్యాఖ్యలు

తెలియదు.. గుర్తులేదు.. మర్చిపోయా.. పోలీసులకు సాదిక్ ఖాన్ సమాధానాలు?

Paradise: ఆ పాట లేకుండానే రిలీజ్.?

2029.. ఏ ఒక్కడిని వదిలిపెట్టను... అనిల్ కుమార్ యాదవ్ మాస్ వార్నింగ్

మజ్జి శ్రీనివాసరావు TDPలో చేరికపై కొండ రాజీవ్ స్ట్రాంగ్ రియాక్షన్

యూకేలో అల్లకల్లోలం.. వెయ్యికి పైగా విమానాలు రద్దు..

అక్క స్కెచ్ అదిరిందిగా! బిగ్ బాస్ లోకి రమానందన వైల్డ్ కార్డ్ ఎంట్రీ?

Photos

+5

సింపుల్ లుక్‌లో స్టన్నింగ్ బ్యూటీ.. శ్రీనిధి శెట్టి (ఫొటోలు)

+5

భార్యతో సుకుమార్.. 80s రెట్రో లుక్‌లో అదిరిపోయే.. (ఫొటోలు)

+5

రష్మిక పాత ఫొటోలు.. క్యూట్‌నెస్‌కు ఫిదా అవ్వాల్సిందే (ఫోటోలు)

+5

భార్య ప్రేమలో నాగశౌర్య.. క్యూట్‌ మూమెంట్స్‌ (ఫొటోలు)

+5

ఓయూలో ఘనంగా 85వ స్నాతకోత్సవం (ఫోటోలు)

+5

‘ఎపిక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. (ఫొటోలు)

+5

దువాతో రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకొణె.. వైరల్‌గా ఫ్యామిలీ (ఫొటోలు)

+5

అందాల ఆషిక.. చీరలో ఆకట్టుకుందిలా..(ఫొటోలు)

+5

అబు జాని 40 సంవత్సరాల ఈవెంట్‌...మెరిసిన ప్రముఖులు (ఫొటోలు)

+5

‘ఎపిక్ ’మూవీ.. హీరోయిన్ వైష్ణవి చైతన్య (ఫొటోలు)