Breaking News

మొన్ననేమో సంచలనం.. ఇప్పుడు 86 పరుగులకే ఆలౌట్‌!

Published on Tue, 02/06/2024 - 11:53

వెస్టిండీస్‌.. ఈ జట్టు ఎప్పుడు ఎలా ఆడుతుందో ఎవరూ అంచనా వేయలేరు. కొన్నిసార్లు సంచలనాలు సృష్టిస్తే.. మరికొన్ని సార్లు అత్యంత చెత్త ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకుంటుంది. అయితే మరోసారి వెస్టిండీస్‌ దారుణ ప్రదర్శన కనబరిచింది. కాన్‌బెర్రా వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో వన్డేలో కరేబియన్‌ బ్యాటర్లు ఘెరంగా విఫలమయ్యారు.

ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన విండీస్‌.. ఆసీస్‌ బౌలర్ల దాటికి కేవలం 86 పరుగులకే కుప్ప​కూలింది. ఆస్ట్రేలియా బ్యాటర్లలో యువ పేసర్‌ జేవియర్ బార్ట్‌లెట్ 4 వికెట్లతో విండీస్‌ పతనాన్ని శాసించగా.. లాన్స్‌ మోరిస్‌, జంపా రెండు వికెట్లతో రాణించారు. విండీస్‌ బ్యాటర్లలో ఎనిమిది మంది బ్యాటర్లు సింగిల్‌ డిజిట్‌ స్కోర్లకే పరిమితమయ్యారు.

ఓపెనర్‌ ఆథ్‌నాజ్‌(32) పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. ఇక ఇప్పటికే తొలి రెండు వన్డేల్లో ఓటమి చవిచూసిన విండీస్‌ ఇప్పటికే సిరీస్‌ను 2-0 తేడాతో కోల్పోయింది. అంతకుముందు గబ్బా వేదికగా జరిగిన ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్టులో విండీస్‌ సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే.  విండీస్‌ యువ పేసర్‌ షామర్ జోసెఫ్ అద్బుత ప్రదర్శనతో 27 ఏళ్ల తర్వాత ఆసీస్‌ గడ్డపై తమ జట్టుకు తొలి విజయాన్ని అందించాడు.

Videos

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు