Breaking News

Ranji Trophy 2024: డిఫెండింగ్‌ ఛాంపియన్స్‌కు షాక్‌

Published on Mon, 10/14/2024 - 17:59

రంజీ ట్రోఫీ 2024 సీజన్‌ ఆరంభంలోనే సంచలనం​ నమోదైంది. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ముంబైకు బరోడా జట్టు షాకిచ్చింది. వడోదరా వేదికగా జరిగిన మ్యాచ్‌లో ముంబైపై బరోడా 84 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన బరోడా తొలి ఇన్నింగ్స్‌లో 290 పరుగులకు ఆలౌటైంది. 

మితేశ్‌ పటేల్‌ (86), అతిత్‌ సేథ్‌ (66) అర్ద సెంచరీలతో రాణించారు. ముంబై బౌలర్లలో తనుశ్‌ కోటియన్‌ నాలుగు వికెట్లు పడగొట్టగా.. షమ్స్‌ ములానీ మూడు, శార్దూల్‌ ఠాకూర్‌ రెండు, మోహిత్‌ అవస్తి ఓ వికెట్‌ దక్కించుకున్నారు.

అనంతరం బరిలోకి దిగిన ముంబై తొలి ఇన్నింగ్స్‌లో 214 పరుగులకు పరిమితమైంది. ముంబై ఇన్నింగ్స్‌లో ఆయుశ్‌ మాత్రే (52) ఒక్కడే అర్ద సెంచరీతో రాణించాడు. స్టార్‌ ఆటగాళ్లు పృథ్వీ షా 7, ఆజింక్య రహానే 29, శ్రేయస్‌ అయ్యర్‌ 0, శార్దూల్‌ ఠాకూర్‌ 27 పరుగులకు ఔటయ్యారు. బరోడా బౌలర్లలో భార్గవ్‌ భట్‌ నాలుగు, అభిమన్యు సింగ్‌ మూడు, మహేశ్‌ పితియా రెండు, కృనాల్‌ పాండ్యా ఓ వికెట్‌ పడగొట్టారు.

76 పరుగుల లీడ్‌తో సెకెండ్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభించిన బరోడా.. తనుశ్‌ కోటియన్‌ ఐదేయడంతో (5/61) 185 పరుగులకే ఆలౌటైంది. హిమాన్షు సింగ్‌ 3, మోహిత్‌ అవస్తి, శార్దూల్‌ ఠాకూర్‌ తలో వికెట్‌ పడగొట్టారు. బరోడా ఇన్నింగ్స్‌లో కృనాల్‌ పాండ్యా (55) అర్ద సెంచరీతో రాణించాడు. 

262 పరుగుల ఓ మోస్తరు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ముంబై.. భార్గవ్‌ భట్‌ (6/55) మాయాజాలం​ ధాటికి 177 పరుగులకే కుప్పకూలింది. ఫలితంగా చిన్న జట్టు చేతిలో ఘోర పరాజయాన్ని చవి చూసింది. ముంబై ఇ‍న్నింగ్స్‌లో సిద్దేశ్‌ లాడ్‌ ఒక్కడే (59) అర్ద సెంచరీతో రాణించాడు.  

చదవండి: చరిత్రపుటల్లోకెక్కిన కమిందు మెండిస్‌

 

 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)