Breaking News

రిటైర్మెంట్‌ ప్రకటించిన టీమిండియా బౌలర్‌

Published on Fri, 08/30/2024 - 07:07

టీమిండియా లెఫ్ట్‌ ఆర్మ్‌ మీడియం పేస్‌ బౌలర్‌ బరిందర్‌ స్రాన్‌ అంతర్జాతీయ క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్‌ ప్రకటించాడు. అలాగే దేశవాలీ క్రికెట్‌కు కూడా వీడ్కోలు పలికాడు. ఈ విషయాన్ని అతను ఇన్‌స్టా వేదికగా వెల్లడించాడు. 31 ఏళ్ల స్రాన్‌ 2016లో టీమిండియా తరఫున 6 వన్డేలు, 2 టీ20లు ఆడి 13 వికెట్లు తీశాడు. జింబాబ్వేతో జరిగిన ఓ టీ20 మ్యాచ్‌లో స్రాన్‌ కేవలం 10 పరుగులిచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు. 

ఈ ప్రదర్శనకు గాను అతనికి ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు లభించింది. స్రాన్‌ తన వన్డే, టీ20 కెరీర్‌లను ఎంఎస్‌ ధోని నేతృత్వంలోనే ప్రారంభించాడు. అప్పట్లో స్రాన్‌కు ధోని మద్దతు బాగా ఉండేది. స్రాన్‌ ఓ మోస్తరుగా రాణించినా టీమిండియాలో చోటు కాపాడుకోలేకపోయాడు. స్రాన్‌ వన్డే అరంగేట్రం చేసే సమయానికి కేవలం ఎనిమిది లిస్ట్‌-ఏ మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. స్వల్ప వ్యవధిలోనే అతను అద్భుత ప్రదర్శనలు చేసి టీమిండియాలో చోటు దక్కించుకున్నాడు. 

స్రాన్‌ వివిధ ఫ్రాంచైజీల తరఫున ఐపీఎల్‌లోనూ ఆడాడు. అతను రాజస్థాన్‌ రాయల్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, కింగ్స్‌ ఎలెవెన్‌ పంజాబ్‌, ముంబై ఇండియన్స్‌ తరఫున 24 మ్యాచ్‌లు ఆడి 18 వికెట్లు పడగొట్టాడు.  స్రాన్‌ తన చివరి ఫస్ట్‌ క్లాస్‌ మ్యాచ్‌ను 2019లో.. లిస్ట్‌-ఏ మ్యాచ్‌ను 2021లో ఆడాడు. అప్పటినుంచి అతనికి అవకాశాలు రాక క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు.

 

 

 

Videos

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బాబుకు హైకోర్టు షాక్.. బండి దీప్తి సంచలన కామెంట్స్

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

ఈ రోజు కరకట్టలో కూర్చొని ముసిముసి నవ్వులు నవ్వొచ్చు.. రేపు అనేది మీ ఊహకే వదిలేస్తున్నాం

మా కార్యకర్తలను చంపడానికా ఈ ఎలక్షన్ లు పెట్టారు.. SECని నిలదీసిన YSRCP నేతలు

టీడీపీ గూండాల దాడిపై వైఎస్ జగన్ ప్రెస్ మీట్

నామినేషన్లపై పెద్దిరెడ్డి సంచలన కామెంట్స్

Photos

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)