Breaking News

డికాక్‌ సునామీ ఇన్నింగ్స్‌.. 9 ఫోర్లు, 6 సిక్స్‌లతో! రాయల్స్‌ ఘన విజయం

Published on Mon, 09/02/2024 - 13:47

క‌రేబియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌-2024ను బార్బడోస్ రాయల్స్ విజ‌యంతో ఆరంభించింది. ఆదివారం సర్ వివియన్ రిచర్డ్స్ స్టేడియం వేదిక‌గా ఆంటిగ్వా అండ్‌ బార్బుడా ఫాల్కన్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో బార్బ‌డోస్ రాయ‌ల్స్ ఘ‌న విజ‌యం సాధించింది. 

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బార్బుడా ఫాల్కన్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 9 వికెట్లు కోల్పోయి 145 ప‌రుగులు చేసింది. బార్బుడా బ్యాట‌ర్ల‌లో జ్యువెల్ ఆండ్రూ(48) మిగితా బ్యాటర్లంతా విఫ‌ల‌మ‌య్యారు. రాయల్స్ బౌల‌ర్లలో మెకాయ్ మూడు వికెట్లు ప‌డ‌గొట్టగా.. థీక్ష‌ణ‌, హోల్డ‌ర్ త‌లా రెండు వికెట్లు సాధించారు.

డికాక్ ఊచ‌కోత‌..
అనంత‌రం 146 ప‌రుగుల ల‌క్ష్యాన్ని బార్బడోస్ రాయల్స్ కేవ‌లం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి ఊదిప‌డేసింది. ల‌క్ష్య చేధ‌న‌లో రాయ‌ల్స్ ఓపెన‌ర్ క్వింటన్ డికాక్ విధ్వంసం సృష్టించాడు. కేవలం 45 బంతుల్లోనే 9 ఫోర్లు, 6 సిక్స్‌లతో 87 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. 

అతడితో పాటు మరో ఓపెనర్ కార్న్‌వాల్‌(34) సైతం దూకుడుగా ఆడాడు. ఆంటిగ్వా బౌలర్లలో వసీం ఒక్కడే వికెట్ సాధించాడు.
చదవండి: #Babar Azam: 'బాబర్‌ నీ పని అయిపోయింది.. వెళ్లి జింబాబ్వేలో ఆడుకో'

 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)