Breaking News

రెండో టి20లో బంగ్లాదేశ్‌ విజయం

Published on Sun, 11/30/2025 - 02:53

చిట్టోగ్రామ్‌: ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టిన బంగ్లాదేశ్‌ జట్టు... ఐర్లాండ్‌తో రెండో టి20లో విజయం సాధించింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో పరాజయం పాలైన బంగ్లాదేశ్‌... రెండో మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను 1–1తో సమంచేసింది. శనివారం జరిగిన పోరులో ఆతిథ్య బంగ్లాదేశ్‌ 4 వికెట్ల తేడాతో ఐర్లాండ్‌ను చిత్తుచేసింది. టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన ఐర్లాండ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. 

టకర్‌ (32 బంతుల్లో 41; 4 ఫోర్లు) టాప్‌ స్కోరర్‌ కాగా... కెపె్టన్‌ పాల్‌ స్టిర్లింగ్‌ (14 బంతుల్లో 29; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), టిమ్‌ టెక్టర్‌ (25 బంతుల్లో 38; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. బంగ్లాదేశ్‌ బౌలర్లలో మెహదీ హసన్‌ మిరాజ్‌ 25 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టగా... తన్జీమ్‌ హసన్‌ షకీబ్, మొహమ్మద్‌ సైఫుద్దీన్‌ చెరో వికెట్‌ పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో బంగ్లాదేశ్‌ 19.4 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. 

‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’, కెప్టెన్ లిటన్‌ దాస్‌ (37 బంతుల్లో 57; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) హాఫ్‌సెంచరీతో రాణించగా... పర్వేజ్‌ హుసేన్‌ (28 బంతుల్లో 43; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఆకట్టుకున్నాడు. ఒక దశలో 138/2తో పటిష్ట స్థితిలో కనిపించిన బంగ్లాదేశ్‌ ఆ తర్వాత వరుసగా వికెట్లు కోల్పోయి కాస్త ఇబ్బందిపడింది. 

తన్జిద్‌ హసన్‌ (7), తౌహిద్‌ హృదయ్‌ (6), నూరుల్‌ హసన్‌ (5) విఫలమయ్యారు. దీంతో ఉత్కంఠ రేగినా... ఆఖర్లో సైఫుద్దీన్‌ (7 బంతుల్లో 17 నాటౌట్‌; 2 ఫోర్లు, 1 సిక్స్‌) కీలక పరుగులు చేసి మరో రెండు బంతులు మిగిలుండగా... జట్టును గెలిపించాడు. ఐర్లాండ్‌ బౌలర్లలో మార్క్‌ అడైర్, గారెత్‌ చెరో 2 వికెట్లు పడగొట్టారు. ఇరు జట్ల మధ్య నిర్ణయాత్మక మూడో టి20 మంగళవారం జరగనుంది.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)