నువ్వు చేసిన పాపాలు ఊరికే పోవు.. బాలినేనిపై రెచ్చిపోయిన ఎమ్మెల్యే దామచర్ల
Breaking News
బంగ్లాతో పాక్ టెస్టు... మ్యాచ్ ఆరంభానికి ముందు భూకంపం..
Published on Fri, 11/26/2021 - 13:19
Earthquake hits Chattogram ahead of opening Test: ఛటోగ్రామ్ వేదికగా బంగ్లాదేశ్- పాకిస్తాన్ మధ్య తొలి టెస్ట్ శుక్రవారం (నవంబర్26) ప్రారంభమైంది. అయితే మ్యాచ్ ఆరంభానికి ముందు శుక్రవారం తెల్లవారుజామున ఛటోగ్రామ్ నగరంలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.3గా నమోదైంది. దీంతో అభిమానులు ఆందోళనకు గురయ్యారు.
అయితే భూకంప తీవ్రత మ్యాచ్ నిర్వహణపై ఎటువంటి ప్రభావం చూపలేదు. అనుకున్న సమయానికే మ్యాచ్ ప్రారంభమైంది. కాగా టీ20 సిరీస్‌లో పాకిస్తాన్ ఆతిథ్య బంగ్లాదేశ్‌ను వైట్ వాష్(0-3) చేసింది. దీంతో కనీసం టెస్ట్ సిరీస్ అయినా గెలిచి పరువు దక్కించుకోవాలని బంగ్లాదేశ్ భావిస్తోంది.
మరో వైపు బంగ్లా టీ20 కెప్టెన్ మహ్మదుల్లా టెస్ట్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన సంగతి తెలిసిందే. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచకున్న బంగ్లాదేశ్ 40 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 108 పరుగులు చేసింది.
చదవండి: IPL 2022 Auction: అప్పుడు 8 కోట్లు... ఇప్పుడు 14 కోట్లకు ఓకే అన్నాడట.. కెప్టెన్‌గానే!
Tags : 1