Breaking News

వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌.. బంగ్లాదేశ్‌ జట్టు ప్రకటన! స్టార్‌ ప్లేయర్‌ దూరం

Published on Mon, 11/11/2024 - 13:17

వెస్టిండీస్‌తో జ‌ర‌గ‌నున్న రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ కోసం 15 మంది స‌భ్యుల‌తో కూడిన తమ జట్టును బంగ్లాదేశ్‌ క్రికెట్‌ ప్రకటించింది. ఈ జట్టుకు నజ్ముల్ షాంటో సారథ్యం వహించాడు. అదేవిధంగా విండీస్‌తో సిరీస్‌కు స్టార్‌ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ ముష్ఫికర్‌ రహీం దూరమయ్యాడు. 

షార్జా వేదికగా అఫ్గానిస్తాన్‌తో జరిగిన మొదటి వన్డేలో ముష్ఫికర్‌ ఎడమ చేతి చూపుడు వేలికి గాయమైంది. దీంతో సిరీస్‌ మధ్యలోనే రహీం వైదొలిగాడు. అతడు తిరిగి మళ్లీ విండీస్‌తో వన్డే సిరీస్‌ సమయానికి కోలుకునే అవకాశమున్నట్లు బంగ్లా క్రికెట్‌ వర్గాలు వెల్లడించాయి.

ఇక వెటరన్‌ ఆల్‌రౌండర్‌ షకీబ్‌ అల్‌హసన్‌ను ఈ సిరీస్‌కు కూడా సెలక్టర్లు ఎంపిక చేయలేదు. దీంతో అతడి కెరీర్‌ ముగిసినట్లే చెప్పుకోవాలి. ఇంతకుముందు దక్షిణాఫ్రికా సిరీస్‌కు అతడిని బంగ్లా సెలక్టర్లు పరిగణలోకి తీసుకోలేదు. కాగా వరల్డ్‌ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భాగంగా ఈ సిరీస్‌ జరగనుంది. ఆంటిగ్వా వేదికగా నవంబర్‌ 22 నుంచి ఇరు జట్ల మధ్య రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ ప్రారంభం కానుంది.

విండీస్‌తో టెస్టులకు బంగ్లా జట్టు
నజ్ముల్ హుస్సేన్ శాంటో (కెప్టెన్‌), షద్మాన్ ఇస్లాం, మహ్మదుల్ హసన్ జాయ్, జాకీర్ హసన్, మోమినుల్ హక్ షోరబ్, మహిదుల్ ఇస్లాం అంకోన్, లిట్టన్ దాస్ (వికెట్‌ కీపర్‌), జాకర్ అలీ అనిక్, మెహిదీ హసన్ మిరాజ్ (వైస్‌ కెప్టెన్‌), తైజుల్ ఇస్లాం, షోరిఫుల్ ఇస్లాం, తస్కిన్ అహ్మద్ , హసన్ మహమూద్, నహిద్ రాణా, హసన్ మురాద్
చదవండి: హార్దిక్‌ సెల్ఫిష్‌ ఇన్నింగ్స్‌..! ఇదంతా ఐపీఎల్‌ కోసమేనా: పాక్‌ మాజీ క్రికెటర్‌
 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)