Breaking News

పాక్‌ను చిత్తు చేశాం.. భారత్‌తో సిరీస్‌కు సిద్ధం: బంగ్లా కెప్టెన్‌

Published on Tue, 09/03/2024 - 16:08

బంగ్లాదేశ్‌ క్రికెట్‌ జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. పాకిస్తాన్‌ను సొంతగడ్డపై ఓడించి తొలిసారి.. ఆ జట్టుపై టెస్టు సిరీస్‌ విజయం సాధించింది. స్వదేశంలో ఉద్రిక్తతల నేపథ్యంలో అసలు పాక్‌ పర్యటన సాగుతుందా లేదోనన్న సందేహాల నడుమ.. అక్కడికి వెళ్లడమే కాదు ఏకంగా ట్రోఫీ గెలిచి సంచలన ప్రదర్శనతో ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలో నజ్ముల్‌ షాంటో బృందంపై ప్రశంసల వర్షం కురుస్తోంది.

ఆరు వికెట్ల తేడాతో ఓడించి
కాగా ప్రపంచటెస్టు చాంపియన్‌షిప్‌ 2023- 25 సీజన్‌లో భాగంగా పాకిస్తాన్‌- బంగ్లాదేశ్‌ మధ్య రెండు మ్యాచ్‌ల సిరీస్‌ జరిగింది. రావల్పిండి వేదికగా జరిగిన తొలి టెస్టులో పది వికెట్ల తేడాతో పాక్‌ను మట్టికరిపించిన బంగ్లాదేశ్‌.. మంగళవారం ముగిసిన రెండో మ్యాచ్‌లోనూ జయభేరి మోగించింది. ఆతిథ్య జట్టును ఆరు వికెట్ల తేడాతో ఓడించి సిరీస్‌ కైవసం చేసుకుంది.

మాటలు రావడం లేదు
ఈ క్రమంలో చారిత్మక విజయంపై స్పందించిన బంగ్లాదేశ్‌ కెప్టెన్‌ నజ్ముల్‌ షాంటో మాట్లాడుతూ.. ‘‘ఈ గెలుపు మాకెంతో కీలకమైనది. ఈ ఆనందాన్ని మాటల్లో వర్ణించలేను. చాలా చాలా సంతోషంగా ఉంది. పాకిస్తాన్‌లో గెలిచి తీరాలని పట్టుదలగా ఉన్నాం. అందుకు తగ్గట్లుగానే జట్టులోని ప్రతి ఒక్కరు తమ పాత్రను చక్కగా పోషించి ఈ గెలుపునకు కారణమయ్యారు.

మా జట్టు అద్బుతంగా ఆడింది. ముఖ్యంగా రెండో టెస్టులో మా పేసర్లు అత్యుత్తమంగా రాణించడం వల్లే అనుకున్న ఫలితం రాబట్టగలిగాం. గెలవాలన్న కసి, పట్టుదల మమ్మల్ని ఈస్థాయిలో నిలిపాయి. తదుపరి టీమిండియాతో తలపడబోతున్నాం. ఆ సిరీస్‌ కూడా ఎంతో ముఖ్యమైనది. 

టీమిండియాతో సిరీస్‌కు సిద్ధం
ఈ విజయం ఇచ్చిన ఉత్సాహంతో ఆత్మవిశ్వాసంతో భారత్‌లో అడుగుపెడతాం. టీమిండియాతో సిరీస్‌లో ముష్ఫికర్‌ రహీం, షకీబ్‌ అల్‌ హసన్‌ అత్యంత కీలకం కానున్నారు. ఇక మిరాజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. ఇలాంటి పరిస్థితుల్లోనూ అతడు ఐదు వికెట్లు పడగొట్టిన తీరు అద్భుతం. భారత్‌తో మ్యాచ్‌లోనూ ఇదే పునరావృతం చేస్తాడని ఆశిస్తున్నా’’ అని పేర్కొన్నాడు. 

టీమిండియాతో సిరీస్‌కు ముందు పాక్‌ను క్లీన్‌స్వీప్‌ చేయడం తమ ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచిందని నజ్ముల్‌ షాంటో తెలిపాడు.కాగా సెప్టెంబరు 19 నుంచి రోహిత్‌ సేనతో బంగ్లాదేశ్‌ రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ మొదలుకానుంది.

పాకిస్తాన్‌ వర్సెస్‌ బంగ్లాదేశ్‌ రెండో టెస్టు స్కోర్లు
వేదిక: రావల్పిండి
టాస్‌: బంగ్లాదేశ్‌.. తొలుత బౌలింగ్‌

పాక్‌ తొలి ఇన్నింగ్స్‌ స్కోరు: 274 ఆలౌట్‌
బంగ్లా తొలి ఇన్నింగ్స్‌ స్కోరు: 262 ఆలౌట్‌

పాక్‌ రెండో ఇన్నింగ్స్‌ స్కోరు: 172 ఆలౌట్‌
బంగ్లా రెండో ఇన్నింగ్స్‌ స్కోరు: 185/4

ఫలితం: ఆరు వికెట్ల తేడాతో పాక్‌పై బంగ్లా గెలుపు
ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌: లిటన్‌ దాస్‌
ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌: మెహదీ హసన్‌ మిరాజ్‌

చదవండి: సొంతగడ్డపై పాకి​స్తాన్‌కు ఘోర పరాభవం.. క్లీన్‌ స్వీప్‌ చేసిన బంగ్లాదేశ్‌

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)