Breaking News

రిషాద్‌ ‘సిక్సర్‌’

Published on Sun, 10/19/2025 - 04:34

మీర్‌పూర్‌: ఇటీవల టీమిండియాతో టెస్టు సిరీస్‌లో ‘వైట్‌ వాష్‌’కు గురైన వెస్టిండీస్‌ జట్టు... బంగ్లాదేశ్‌ పర్యటనను కూడా పరాజయంతోనే ప్రారంభించింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా శనివారం జరిగిన తొలి వన్డేలో ఆతిథ్య బంగ్లాదేశ్‌ 74 పరుగుల తేడాతో విండీస్‌ను చిత్తుచేసింది. టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్‌ 49.4 ఓవర్లలో 207 పరుగులకు ఆలౌటైంది. తౌహిద్‌ హృదయ్‌ (90 బంతుల్లో 51; 3 ఫోర్లు) అర్ధశతకం సాధించగా... మహిదుల్‌ ఇస్లామ్‌ (46), నజ్ముల్‌ హుసేన్‌ షంటో (32) ఫర్వాలేదనిపించారు. 

విండీస్‌ బౌలర్లలో జైడెన్‌ సీల్స్‌ 3 వికెట్లు పడగొట్టగా... రోస్టన్‌ చేజ్, జస్టన్‌ గ్రీవ్స్‌ చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం సులభతర లక్ష్యఛేదనలో కరీబియన్‌ జట్టు విఫలమైంది. బ్యాటర్లంతా తేలపోవడంతో చివరకు 39 ఓవర్లలో 133 పరుగులకు ఆలౌటైంది. బ్రాండన్‌ కింగ్‌ (60 బంతుల్లో 44; 5 ఫోర్లు, 1 సిక్స్‌) కాస్త పోరాడాడు. 

బంగ్లాదేశ్‌ బౌలర్లలో రిషాద్‌ హుసేన్‌ 35 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టాడు. అతడి ధాటికి విండీస్‌ టాపార్డర్‌ పెవిలియన్‌కు క్యూ కట్టింది. బ్యాటింగ్‌లోనూ 13 బంతులు ఎదుర్కొని ఒక ఫోర్, 2 సిక్స్‌ల సాయంతో 26 పరుగులు చేసిన రిషాద్‌... బౌలింగ్‌ అదరగొట్టి ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు దక్కించుకున్నాడు. ఇరు జట్ల మధ్య మంగళవారం ఇక్కడే రెండో వన్డే జరగనుంది. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)