Breaking News

సెమీస్‌లో భారత్‌ను ఓడించి.. కట్‌చేస్తే ఇప్పుడు ఏకంగా ఛాంపియన్స్‌గా

Published on Mon, 12/18/2023 - 07:35

అండర్-19 ఆసియాకప్‌ 2023 ఛాంపియన్స్‌గా బంగ్లాదేశ్‌ నిలిచింది. దుబాయి వేదికగా జరిగిన ఫైనల్లో యూఏఈను 195 పరుగుల తేడాతో చిత్తు చేసిన బంగ్లాదేశ్‌.. తొలిసారి అండర్‌-19 ఆసియాకప్‌ టైటిల్‌ను ముద్దాడింది. తుది పోరులో మొదట బ్యాటింగ్‌ చేసిన బంగ్లాదేశ్‌ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 282 పరుగులు చేసింది.

బంగ్లా బ్యాటర్లలో ఓపెనర్ అషికర్ రెహ్మాన్ షిబ్లీ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. 149 బంతులు ఎదుర్కొన్న  అషికర్ రెహ్మాన్.. 12 ఫోర్లు, 1 సిక్సర్‌తో 129 పరుగులు చేశాడు. అతడితోపాటు రిజ్వాన్‌(60), అరిఫుల్‌ ఇస్లాం(50) పరుగులతో రాణించారు. యూఏఈ బౌలర్లలో ఆయామన్‌ ఆహ్మద్‌ 4 వికెట్లతో చెలరేగగా.. ఒమిడ్‌ రెహ్మద్‌ రెండు వికెట్లు సాధించాడు.

అనంతరం 283 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన యూఏఈ.. బంగ్లా బౌలర్ల దాటికి కేవలం 87 పరుగులకే కుప్పకూలింది. బంగ్లా బౌలర్లలో రోహనత్, మరూఫ్‌ మిర్దా తలా మూడు వికెట్లు పడగొట్టగా... ఇక్భాల్‌, షేక్‌ ఫవీజ్‌ చెరో రెండు వికెట్లు సాధించారు. కాగా సెమీఫైనల్లో భారత్‌ను బంగ్లాదేశ్‌ ఓడించిన సంగతి తెలిసిందే.
చదవండి: IND VS SA 1st ODI: ఏ భారత కెప్టెన్‌కు సాధ్యం కాని ఘనతను సాధించిన కేఎల్‌ రాహుల్‌
 

Videos

దీపావళి తర్వాత మూతపడనున్న పెట్రోల్ బంకులు? కారణం ఇదుకే..!

ప్రొద్దుటూరులో హై టెన్షన్.. రాచమల్లు, YSRCP నేతలపై లాఠీ ఛార్జ్

గుత్తిలో కౌన్సిలర్ల నామినేషన్లకు అడ్డంకులు.. శివంగిలా ఎదురెళ్లి ఇచ్చిపడేసిన నైరుతి రెడ్డి

150 కుటుంబాలు TDPకి బై బై.. విజయనగరంలో బాబుకు బిగ్ షాక్

విజయవాడ మేయర్ నాదే.. రాయన భాగ్యలక్ష్మి వైరల్ కామెంట్స్

మీ కంటే YSRCP నయం.. 40 సంవత్సరాలు TDPకి పని చేసినందుకు మీరు నాకు ఇచ్చిన గిఫ్ట్ ఇదా..!

లక్షకు 42 లక్షల లాభం.. రాకెట్ లా దూసుకెళ్తున్న షేర్

ఫై దుబాయ్ ఘటనలో.. భయానక అనుభవాలు.. బయటపెట్టిన పైలట్ స్మిత్ మచ్చర్

తమన్నాతో బ్రేకప్.. మళ్లీ ఆమెతో డేటింగ్.!

అగ్నిగుండంగా పారిస్.. చారిత్రక భవనానికి నిప్పు

Photos

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)