Breaking News

సరిపోని ఐర్లాండ్‌ పోరాటం.. బంగ్లాదేశ్‌ ఖాతాలో మరో సిరీస్‌

Published on Fri, 04/07/2023 - 13:33

ఢాకా వేదికగా ఐర్లాండ్‌తో జరిగిన ఏకైక టెస్ట్‌లో బంగ్లాదేశ్‌ సూపర్‌ విక్టరీ సాధించింది. ఈ గెలుపుతో బంగ్లాదేశ్‌.. ప్రస్తుత పర్యటనలో ఐర్లాండ్‌ను మూడు ఫార్మాట్లలో మట్టికరిపించి, సొంతగడ్డపై తిరుగులేని ఆధిపత్యాన్ని కొనసాగించింది. ఈ సిరీస్‌కు ముందు స్వదేశంలో జగజ్జేత ఇంగ్లండ్‌ను సైతం ఓ ఆట ఆడుకున్న (3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌) బంగ్లా టైగర్స్‌.. తాజాగా పసికూన ఐర్లాండ్‌పై అదే స్థాయిలో రెచ్చిపోయారు. 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను 2-0 తేడాతో కైవసం చేసుకున్న ఆ జట్టు.. టీ20 సిరీస్‌ను 2-1 తేడాతో, టెస్ట్‌ సిరీస్‌ను 1-0 తేడాతో గెలుచుకుంది.  

మ్యాచ్‌ విషయానికొస్తే.. నాలుగు రోజుల్లో ముగిసిన ఏకైక టెస్ట్‌ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. రెండో ఇన్నింగ్స్‌లో ఐర్లాండ్‌ అద్భుతంగా పోరాడినప్పటికీ, ఓటమి నుంచి తప్పించుకోలేకపోయింది. 286/8 ఓవర్‌ నైట్‌ స్కోర్‌తో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన ఐర్లాండ్‌.. మరో 6 పరుగులు మాత్రమే జోడించి మిగతా 2 వికెట్లు కోల్పోయింది.

బంగ్లా ముందు ఫైటింగ్‌ టార్గెట్‌ ఉంచుతుందని భావించిన ఐర్లాండ్‌ ఆఖరి 2 వికెట్లు వెంటవెంటనే కోల్పోయి ఓటమిని అప్పుడే పరోక్షంగా అంగీకరించింది. 138 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బంగ్లాదేశ్‌ 3 వికెట్లు కోల్పోయి ఆడుతూ పాడుతూ విజయం సాధించింది. ఫస్ట్‌ ఇన్నింగ్స్‌లో శతక్కొట్టిన (126) ముష్ఫికర్‌.. రెండో ఇన్నింగ్స్‌లోనూ (51 నాటౌట్‌) అర్ధసెంచరీ సాధించి, తన జట్టును విజయతీరాలకు చేర్చాడు.

మొమినుల్‌ హాక్‌ 20 పరుగులతో అజేయంగా నిలువగా.. తమీమ్‌ ఇక్బాల్‌ (31), లిటన్‌ దాస్‌ (23) జట్టు విజయంలో తలో చేయి వేశారు. సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో ఐర్లాండ్‌ వికెట్‌కీపర్‌ టకెర్‌ (108) సెంచరీ పోరాటం వృధా అయ్యింది. 

స్కోర్‌ వివరాలు..

ఐర్లాండ్‌: 214 & 292

బంగ్లాదేశ్‌: 369 & 138/3

Videos

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)