Breaking News

బంగ్లాదేశ్‌ను గెలిపించిన రీతూ

Published on Mon, 04/14/2025 - 01:28

లాహోర్‌: ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌ క్వాలిఫయింగ్‌ టోర్నీలో బంగ్లాదేశ్‌ జట్టు జోరు కొనసాగుతోంది. ఆదివారం జరిగిన పోరులో బంగ్లాదేశ్‌ జట్టు 2 వికెట్ల తేడాతో ఐర్లాండ్‌పై గెలుపొందింది. మొదట బ్యాటింగ్‌ చేసిన ఐర్లాండ్‌ మహిళల జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 235 పరుగులు చేసింది. లౌరా డెలానీ (75 బంతుల్లో 63; 6 ఫోర్లు) హాఫ్‌ సెంచరీ సాధించగా... ప్రెండర్‌గాస్ట్‌ (41), అమీ హంటర్‌ (33) రాణించారు. బంగ్లాదేశ్‌ బౌలర్లలో రాబియా ఖాన్‌ 3, ఫహిమా ఖాతూన్‌ 2 వికెట్లు పడగొట్టారు.

అనంతరం లక్ష్యఛేదనలో బంగ్లాదేశ్‌ మహిళల జట్టు 48.4 ఓవర్లలో 8 వికెట్లకు 240 పరుగులు చేసింది. ఒకదశలో బంగ్లాదేశ్‌ 94 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే రీతూ మోనీ (61 బంతుల్లో 67 నాటౌట్‌; 6 ఫోర్లు, 1 సిక్స్‌) లోయర్‌ ఆర్డర్‌ బ్యాటర్ల సహకారంతో బంగ్లాదేశ్‌ను విజయతీరానికి చేర్చింది. అంతకుముందు కెప్టెన్  నిగార్‌ సుల్తానా (68 బంతుల్లో 51; 7 ఫోర్లు) అర్ధశతకంతో ఆకట్టుకుంది. 

ఐర్లాండ్‌ బౌలర్లలో ప్రెండర్‌గాస్ట్, అర్లీనా కెల్లి చెరో 2 వికెట్లు తీశారు. ఈ టోర్నీలో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ గెలిచిన బంగ్లాదేశ్‌ 4 పాయింట్లతో పట్టిక అగ్రస్థానానికి చేరింది. తదుపరి మ్యాచ్‌లో మంగళవారం స్కాట్లాండ్‌తో బంగ్లాదేశ్‌ తలపడుతుంది.   

స్కాట్లాండ్‌ రెండో విజయం 
మరోవైపు స్కాట్లాండ్‌ జట్టు కూడా రెండో విజయం సాధించింది. థాయ్‌లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో స్కాట్లాండ్‌ 58 పరుగుల తేడాతో గెలిచింది. మొదట స్కాట్లాండ్‌ 41 ఓవర్లలో 206 పరుగులకు ఆలౌటైంది. కెపె్టన్‌ క్యాథరిన్‌ బ్రైస్‌ (58 బంతుల్లో 60; 7 ఫోర్లు), మేగన్‌ మెక్‌కాల్‌ (60 బంతుల్లో 57; 6 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధశతకాలు సాధించారు.

అలీసా లిస్టర్‌ (38; 6 ఫోర్లు) రాణించింది. అనంతరం లక్ష్యఛేదనలో థాయ్‌లాండ్‌ జట్టు 31.3 ఓవర్లలో 148 పరుగులకు ఆలౌటైంది. ఈ టోర్నమెంట్‌లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు ఈ ఏడాది చివర్లో భారత్‌ వేదికగా జరగనున్న మహిళల వన్డే ప్రపంచకప్‌నకు అర్హత సాధిస్తాయి. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)