Breaking News

దేశంలో అల్లర్లు.. 5 రోజుల ముందే పాక్‌కు వెళ్లనున్న బంగ్లా క్రికెట్‌ టీమ్‌!

Published on Sun, 08/11/2024 - 12:50

బంగ్లాదేశ్‌లో హింసాత్మక పరిస్థితులు ఇంకా చల్లారడం లేదు. ఆ దేశ ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేసినప్పటకి అల్లర్లు ఇంకా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో బంగ్లాదేశ్‌-పాకిస్తాన్ మధ్య టెస్టు సిరీస్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి.

అయితే తాజాగా పాకిస్తాన్ క్రికెట్ వర్గాల నుంచి అభిమానులకు గుడ్‌న్యూస్ అందింది. ఇరు జట్ల మధ్య సిరీస్ యాధావిథిగా జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ రెండు టెస్టుల సిరీస్ ఆగస్టు 21 నుంచి ప్రారంభం కానుంది. ఈ క్రమంలో షెడ్యూల్ ప్రకారం ఆగ‌స్టు 17న పాకిస్తాన్‌కు బంగ్లా జట్టు బ‌య‌లుదేరాల్సింది. 

కానీ ఇప్పుడు ఐదు రోజుల ముంద‌గానే  బంగ్లా టీమ్ పాక్‌కు వెళ్లనున్నట్లు సమాచారం. ఆగస్టు 12(​‍మంగళవారం)న బంగ్లాదేశ్ క్రికెట్ జట్టుకు పాకిస్తాన్‌కు పయనం కానున్నట్లు ప్రముఖ క్రికెట్ బెబ్‌సైట్ క్రిక్‌బజ్ తమ కథనంలో పేర్కొంది. 

బంగ్లా ఆటగాళ్లకు అనుకున్నదానికంటే ఎక్కువ రోజులు ఆతిథ్యమివ్వడానికి పీసీబీ సిద్దంగా ఉన్నట్లు క్రిక్‌బజ్ తెలిపింది. పర్యాటక జట్టు ప్రాక్టీస్‌ సెషన్స్‌ కోసం రావల్పిండిలో పీసీబీ అన్నిరకాల ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. 

కాగా ఇరు జట్ల మధ్య తొలి టెస్టు రావల్పిండి వేదికగానే జరగనుంది. వరల్డ్‌ టెస్టు ఛాంపియన్‌ షిప్‌ సైకిల్‌లో భాగంగా ఈ సిరీస్‌ జరగనుంది. ఈ సిరీస్‌ పాకిస్తాన్‌కు చాలా కీలకం. ఈ క్రమంలోనే బంగ్లాతో టెస్టు సిరీస్‌పై పీసీబీ ప్రత్యేక దృష్టి సారించింది. ఈ సిరీస్‌ కోసం ఇప్పటికే  పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు  తమ జట్టును ప్రకటించింది. బంగ్లాదేశ్‌ మాత్రం ఇంకా తమ జట్టును ఎంపిక చేయలేదు.
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)