Breaking News

546 పరుగులతో బంగ్లా గెలుపు.. 21వ శతాబ్దంలో అతిపెద్ద విజయం

Published on Sat, 06/17/2023 - 12:10

బంగ్లాదేశ్‌ తమ టెస్టు క్రికెట్‌ చరిత్రలో అతిపెద్ద విజయాన్ని నమోదు చేసింది. అప్గానిస్తాన్‌తో జరిగిన ఏకైక టెస్టులో 546 పరుగుల తేడాతో అత్యంత భారీ విజయాన్ని మూటగట్టుకుంది. 662 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆఫ్గన్‌ జట్టు 115 పరుగులకే కుప్పకూలింది. ఆఫ్గన్‌ చివరి బ్యాటర్‌ జహీర్‌ ఖాన్‌ రిటైర్డ్‌ ఔట్‌గా వెనుదిరిగాడు. బంగ్లాదేశ్‌ బౌలర్లలో తస్కిన్‌ అహ్మద్‌ నాలుగు వికెట్లు తీయగా.. షోరిఫుల్‌ ఇస్లామ్‌ మూడు, మెమదీ హసన్‌ మిరాజ్‌, ఎబాదత్‌ హొసెన్‌లు చెరొక వికెట్‌ పడగొట్టారు.

ఇక టెస్టు క్రికెట్‌లో పరుగుల పరంగా బంగ్లాదేశ్‌ జట్టుకు తొలి అతిపెద్ద విజయం కాగా.. ఓవరాల్‌గా మూడో అతిపెద్ద విజయం. కాగా 21వ శతాబ్దంలో బంగ్లాదేశ్‌దే అతిపెద్ద విజయం కావడం విశేషం. ఇంతకముందు 1928లో ఆస్ట్రేలియాపై ఇంగ్లండ్‌ 675 పరుగుల తేడాతో విజయం సాధించి తొలి స్థానంలో ఉండగా.. రెండో స్థానంలో ఆస్ట్రేలియా 562 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను(1932లో) ఓడించి రెండో అతిపెద్ద విజయాన్ని నమోదు చేసింది. తాజాగా బంగ్లాదేశ్‌ ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియాల తర్వాత పరుగుల పరంగా అతిపెద్ద విజయాన్ని నమోదు చేసి మూడో స్థానంలో నిలిచింది.

అంతకముందు బంగ్లాదేశ్‌ తమ రెండో ఇన్నింగ్స్‌ను 425 పరుగుల వద్ద డిక్లేర్‌ చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీతో(146 పరుగులు) మెరిసిన నజ్ముల్‌ హొసెన్‌ షాంటో రెండో ఇన్నింగ్స్‌లోనూ(124 పరుగులు) సెంచరీతో మెరవగా.. మోమినుల్‌ హక్‌ కూడా సెంచరీ(121 పరుగులు నాటౌట్‌) మార్క్‌ అందుకున్నాడు. అంతకముందు బంగ్లాదేశ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 382 పరుగులకు ఆలౌట్‌ కాగా.. అఫ్గానిస్తాన్‌ తొలి ఇన్నింగ్స్‌లో 146 పరుగులకే కుప్పకూలింది.

అఫ్గానిస్తాన్‌: తొలి ఇన్నింగ్స్‌ : 146 ఆలౌట్‌
                   రెండో ఇన్నింగ్స్‌: 115 ఆలౌట్‌

బంగ్లాదేశ్‌: తొలి ఇన్నింగ్స్‌: 382 ఆలౌట్‌
                  రెండో ఇన్నింగ్స్‌: 425/4 డిక్లేర్‌

ఫలితం: 546 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌ ఘన విజయం

చదవండి: 'వరల్డ్‌కప్‌ ఆడతామో లేదో'.. పూటకో మాట మారిస్తే ఎలా?

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)