Breaking News

ఒకే ఇన్నింగ్స్‌లో ముగ్గురి తొలి సెంచరీలు.. అరుదైన రికార్డు

Published on Thu, 10/31/2024 - 09:18

బంగ్లాదేశ్‌తో  రెండో టెస్టులో దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌ను భారీస్కోరు వద్ద డిక్లేర్‌ చేసింది. రెండో రోజు వియాన్‌ ముల్డర్‌ (105 నాటౌట్‌; 8 ఫోర్లు, 4 సిక్స్‌లు) కూడా ‘శత’క్కొట్టడంతో ఈ ఇన్నింగ్స్‌లో మొత్తం మూడు సెంచరీలు నమోదయ్యాయి. 

తొలి రోజే ఓపెనర్‌ టోని డి జోర్జి, వన్‌డౌన్‌ బ్యాటర్‌ ట్రిస్టన్‌ స్టబ్స్‌ శతకాలు బాదారు. ఓవర్‌నైట్‌ స్కోరు 307/2తో బుధవారం ఆట కొనసాగించిన దక్షిణాఫ్రికా 144.2 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 575 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది.

ఓవర్‌నైట్‌ బ్యాటర్లు జోర్జి (177; 12 ఫోర్లు, 4 సిక్స్‌లు), బెడింగ్‌హామ్‌ (59; 2 ఫోర్లు, 4 సిక్స్‌లు) మూడో వికెట్‌కు 116 పరుగులు జోడించారు. వేగంగా ఆడి అర్ధసెంచరీ సాధించిన బెడింగ్‌హామ్‌ను తైజుల్‌ బౌల్డ్‌ చేశాడు. 

 5 పరుగుల వ్యవధిలోనే మూడు వికెట్లు
జోర్జి తన శతకాన్ని డబుల్‌ సెంచరీగా మలచుకోలేకపోయాడు. 141 క్రితంరోజు స్కోరుతో ఆట కొనసాగించిన అతను 36 పరుగులు జోడించి తైజుల్‌ బౌలింగ్‌లోనే ఎల్బీగా వెనుదిరిగాడు.

తన మరుసటి ఓవర్లో  కైల్‌ వెరియెన్‌ (0)ను తైజుల్‌ వికెట్ల ముందు దొరకబుచ్చుకోవడంతో తొలి సెషన్‌లో 5 పరుగుల వ్యవధిలోనే మూడు వికెట్లు పడ్డాయి. జట్టు స్కోరు 400 పరుగులు దాటాక... రెండో సెషన్‌లో రికెల్టన్‌ (12) నహీద్‌ రాణా బౌలింగ్‌లో అవుటయ్యాడు. అయితే చకచకా నాలుగు వికెట్లు తీసిన ఆనందం ఆవిరయ్యేందుకు ఎంతోసేపు పట్టలేదు. 

రెండో సెషన్‌లో మరో వికెట్‌ పడకుండా ముల్డర్, సెనురన్‌ ముత్తుస్వామి (75 బంతుల్లో 68 నాటౌట్‌; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఆరో వికెట్‌కు అబేధ్యమైన భాగస్వామ్యాన్ని నిర్మించారు. ఇద్దరు 152 పరుగులు జోడించారు.

దక్షిణాఫ్రికా 575/6 డిక్లేర్డ్‌ 
ఇక టీ విరామం తర్వాత ముత్తుస్వామి అర్ధసెంచరీ, ముల్డర్‌ సెంచరీ పూర్తి చేసుకున్న వెంటనే ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేశారు. లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ తైజుల్‌ ఇస్లామ్‌ (5/198) ఐదు వికెట్లు తీయగలిగాడు కానీ దాదాపు 200 పరుగులు సమర్పించుకున్నాడు. 

అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ఆరంభించిన బంగ్లాదేశ్‌ ఆట ముగిసే సమయానికి 9 ఓవర్లలో 38 పరుగులే చేసి 4 కీలకమైన వికెట్లను కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.

టాప్‌–3 బ్యాటర్లు షాద్‌మన్‌ (0), హసన్‌ (10), జాకీర్‌ హసన్‌ (2) చేతులెత్తేశారు. దక్షిణాఫ్రికా స్టార్‌ పేసర్‌ రబడ 2 వికెట్లు తీయగా, నైట్‌వాచ్‌మన్‌ హసన్‌ (3)ను స్పిన్నర్‌ కేశవ్‌ మహరాజ్‌ అవుట్‌ చేశాడు. మోమినుల్‌ హక్‌ (6 బ్యాటింగ్‌), కెప్టెన్‌ నజ్ముల్‌  హుస్సేన్‌ (4 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నారు.

‘బాక్సింగ్‌ డే’ టెస్టులో
చివరిసారి టెస్టుల్లో దక్షిణాఫ్రికా జట్టు స్కోరు 500 పరుగులు దాటిన సంవత్సరం 2020. ఆ ఏడాది సెంచూరియన్‌లో శ్రీలంక జట్టుతో జరిగిన ‘బాక్సింగ్‌ డే’ టెస్టులో దక్షిణాఫ్రికా 621 పరుగులకు ఆలౌటైంది.

ఒకే ఇన్నింగ్స్‌లో ముగ్గురి తొలి సెంచరీలు.. అరుదైన రికార్డు
ఒకే ఇన్నింగ్స్‌లో ముగ్గురు బ్యాటర్లు తమ తొలి సెంచరీని నమోదు చేయడం ఇది రెండోసారి మాత్రమే. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న టెస్టులో దక్షిణాఫ్రికా తరఫున టోనీ జోర్జి, స్టబ్స్, ముల్డర్‌ సెంచరీలు సాధించారు. 1948లో భారత్‌తో ఢిల్లీలో జరిగిన టెస్టులో వెస్టిండీస్‌ తరఫున గెర్రీ గోమెజ్, రాబర్ట్‌ క్రిస్టియాని, క్లేడ్‌ వాల్కట్‌ తమ తొలి సెంచరీలను నమోదు చేశారు.    

చదవండి: India vs New Zealand: జయమా... పరాభవమా!

Videos

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)