Breaking News

దక్షిణాఫ్రికా బౌలర్ల ఉగ్రరూపం.. 106 పరుగులకే బంగ్లాదేశ్‌ ఆలౌట్‌

Published on Mon, 10/21/2024 - 13:26

టీమిండియా చేతిలో వైట్‌వాష్‌కు గురైన బంగ్లాదేశ్‌ ఆట తీరు ఏ మాత్రం మారలేదు. ఢాకా వేదికగా సౌతాఫ్రికాతో ప్రారంభమైన మొదటి టెస్టులో బంగ్లాదేశ్‌ దారుణ ప్రదర్శన కనబరిచింది. ఈ మ్యాచ్‌లో  ద‌క్షిణాఫ్రికా బౌల‌ర్లు నిప్పులు చేరిగారు.

 టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాకు స‌ఫారీ బౌల‌ర్లు చుక్కలు చూపించారు. సౌతాఫ్రికా పేస‌ర్ల దాటికి బంగ్లా జ‌ట్టు మొద‌టి ఇన్నింగ్స్‌లో  కేవ‌లం 106 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది.  ర‌బ‌డా, ముల్డ‌ర్‌, కేశ‌వ్ మహారాజ్ త‌లా మూడు వికెట్ల‌తో బంగ్లా ప‌త‌నాన్ని శాసించారు. 

బంగ్లా బ్యాట‌ర్లలో మెహ‌దీ హ‌స‌న్ జాయ్‌(30) ప‌రుగుల‌తో టాప్ స్కోర‌ర్‌గా నిలిచారు. మిగితా బ్యాట‌ర్లంతా దారుణంగా విఫ‌ల‌మ‌య్యారు. కాగా బంగ్లాదేశ్‌ గత నెలలో భారత్‌తో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌ను 2-0 తేడాతో కోల్పోయింది.
తుది జట్లు
బంగ్లాదేశ్: షాద్‌మన్ ఇస్లాం, మహ్మదుల్ హసన్ జాయ్, నజ్ముల్ హొస్సేన్ శాంటో(కెప్టెన్‌), మోమినుల్ హక్, ముష్ఫికర్ రహీమ్, లిట్టన్ దాస్(వికెట్‌ కీపర్‌), మెహిదీ హసన్ మిరాజ్, జాకర్ అలీ, నయీమ్ హసన్, తైజుల్ ఇస్లాం, హసన్ మహమూద్

దక్షిణాఫ్రికా : టోనీ డి జోర్జి, ఐడెన్ మార్క్రామ్(కెప్టెన్‌), ట్రిస్టన్ స్టబ్స్, డేవిడ్ బెడింగ్‌హామ్, ర్యాన్ రికెల్టన్, మాథ్యూ బ్రీట్జ్‌కే, కైల్ వెర్రెయిన్నే(వికెట్‌ కీపర్‌), వియాన్ ముల్డర్, కేశవ్ మహరాజ్, కగిసో రబడ, డేన్ పీడ్

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)