Breaking News

5 వికెట్లతో చెలరేగిన తైజుల్‌.. ఐర్లాండ్‌ 214 ఆలౌట్‌ 

Published on Wed, 04/05/2023 - 08:58

Bangladesh vs Ireland, Only Test 2023 Day 1 Score- మిర్పూర్‌: బంగ్లాదేశ్‌తో జరుగుతున్న ఏకైక టెస్ట్‌లో ఐర్లాండ్‌ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 77.2 ఓవర్లలో 214 పరుగులకు ఆలౌటైంది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఐర్లాండ్‌ను బంగ్లాదేశ్‌ ఎడంచేతి వాటం స్పిన్నర్‌ తైజుల్‌ ఇస్లామ్‌ (5/53), మీడియం పేసర్‌ ఇబాదత్‌ హుస్సేన్‌ (2/54), స్పిన్నర్‌ మెహదీ హసన్‌ మిరాజ్‌ (2/43) దెబ్బ కొట్టారు.

ఐర్లాండ్‌ జట్టులో హ్యారీ టెక్టర్‌ (50; 6 ఫోర్లు, 1 సిక్స్‌), లొర్కాన్‌ టకెర్‌ (37; 3 ఫోర్లు), క్యాంఫెర్‌ (34; 6 ఫోర్లు) రాణించారు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి బంగ్లాదేశ్‌ 10 ఓవర్లలో 2 వికెట్లు నష్టపోయి 34 పరుగులు సాధించింది. ఐరిష్‌ బౌలర్లలో మార్క్‌ అడేర్‌ ఒకటి, ఆండీ మెక్‌బ్రిన్‌ ఒక వికెట్‌ తీశారు.

ఇక మొదటి రోజు ముగిసేసరికి ఆతిథ్య బంగ్లాదేశ్‌ ఐర్లాండ్‌ కంటే 180 పరుగులు వెనుకబడి ఉంది. కాగా ఈ మ్యాచ్‌ కంటే ముందు జరిగిన వన్డే సిరీస్‌, టీ20 సిరీస్‌లను బంగ్లాదేశ్‌ 2-0తో కైవసం చేసుకుంది. 

చదవండి: గుజరాత్‌ టైటాన్స్‌కు గుడ్‌న్యూస్‌.. కేన్‌మామ స్థానంలో లంక ఆల్‌రౌండర్‌
ఐపీఎల్‌తో పాటు డబ్ల్యూటీసీ ఫైనల్‌కు దూరం! వన్డే వరల్డ్‌కప్‌ టోర్నీకి కూడా

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)