Breaking News

లేటు వయసులో ఇరగదీస్తున్న బంగ్లా బ్యాటర్‌.. వరుస సెంచరీలు

Published on Wed, 04/05/2023 - 16:14

BAN VS IRE Test Match: బంగ్లాదేశ్‌ వెటరన్‌ బ్యాటర్‌ 35 ఏళ్ల ముష్ఫికర్‌ రహీం లేటు వయసులో కుర్రాళ్లకు మించి రెచ్చిపోతున్నాడు. ఢాకా వేదికగా ఐర్లాండ్‌తో జరుగుతున్న ఏకైక టెస్ట్‌ మ్యాచ్‌లో సెంచరీతో కదం తొక్కిన రహీం (తొలి ఇన్నింగ్స్‌లో 126) వరుస ఇన్నింగ్స్‌ల్లో సెంచరీలు సాధించి ఔరా అనిపించాడు.

ఈ మ్యాచ్‌కు ముందు ఐర్లాండ్‌తో జరిగిన రెండో వన్డేలో చివరిసారిగా బ్యాటింగ్‌ (ఐర్లాండ్‌తో మూడో వన్డేలో రహీంకు బ్యాటింగ్‌ చేసే అవకాశం రాకపోగా.. ఆ తర్వాత జరిగిన 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో రహీం ఆడలేదు) చేసిన రహీం.. ఫలితం తేలకుండా ముగిసిన ఆ మ్యాచ్‌లో 60 బంతుల్లోనే అజేయమైన శతకాన్ని బాది శభాష్‌ అనిపించకున్నాడు. 

తాజా సెంచరీతో టెస్ట్‌ల్లో 10వ సెంచరీ నమోదు చేసిన రహీం.. తన జట్టు తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఐర్లాండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 214 పరుగులకు చాపచుట్టేయగా.. బంగ్లాదేశ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 369 పరుగుల భారీ స్కోర్‌ చేసి 155 పరుగుల ఆధిక్యం సాధించింది.

ఐర్లాండ్‌ ఇన్నింగ్స్‌లో హ్యారీ టెక్టార్‌ (50) అర్ధసెంచరీతో రాణించగా..  బంగ్లా బౌలర్‌ తైజుల్‌ ఇస్లాం 5 వికెట్లతో చెలరేగాడు. బంగ్లా తొలి ఇన్నింగ్స్‌లో రహీంతో పాటు షకీబ్‌ అల్‌ హసన్‌ (87), మెహిది హసన్‌ (55) రాణించగా.. ఐరిష్‌ బౌలర్‌ ఆండీ మెక్‌బ్రైన్‌ 6 వికెట్లతో సత్తా చాటాడు. రెండో రోజు మూడో సెషన్‌లో రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఐర్లాండ్‌.. పరుగులేమీ చేయకుండానే నాలుగో బంతికే వికెట్‌ కోల్పోయింది. జేమ్స్‌ మెక్‌కొల్లమ్‌ను షకీబ్‌ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. 

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)