Breaking News

‘మహిళల స్వేచ్ఛ’పై నినదించినందుకు...

Published on Sun, 08/11/2024 - 04:22

పారిస్‌: ఒలింపిక్స్‌ క్రీడల ‘బ్రేకింగ్‌’ (బ్రేక్‌ డ్యాన్స్‌) ఈవెంట్‌లో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. నెదర్లాండ్స్‌ ప్లేయర్‌ ఇండియా సర్జో, ఐఓసీ శరణార్ధి టీమ్‌కు చెందిన మనీజా తలాష్‌ మధ్య ప్రి క్వాలిఫయర్‌ మ్యాచ్‌ జరిగింది. ఈ పోరు కొనసాగుతున్న సమయంలో మనీజా అఫ్గనిస్తాన్‌లోని మహిళలను స్వేచ్ఛను ప్రసాదించమంటూ ‘ఫ్రీ అఫ్గాన్‌ ఉమెన్‌’ అంటూ రాసి ఉన్న కేప్‌ను తన డ్రెస్‌పై ధరించి డ్యాన్సింగ్‌ చేసింది. 

అయితే రాజకీయపరమైన వ్యాఖ్యలు, నినాదాలు ప్రదర్శించడంపై ఒలింపిక్స్‌లో నిషేధం ఉంది. దాంతో వెంటనే పోటీని నిలిపివేసిన అధికారులు ఆమెను డిస్‌క్వాలిఫై చేస్తున్నట్లు ప్రకటించారు. మనీజా స్వదేశం అఫ్గానిస్తాన్‌ కాగా... ఆ దేశం తాలిబాన్ల ఆ«దీనంలోకి వచ్చిన తర్వాత అఫ్గాన్‌ నుంచి పారిపోయి స్పెయిన్‌లో శరణార్థిగా తలదాచుకుంది. 

క్రీడల్లో కల నెరవేర్చుకునేందుకు వచ్చానంటూ 21 ఏళ్ల మనీజా తన గురించి చెప్పుకుంది. ఇప్పుడు శరణార్ధి జట్టు ద్వారా ఒలింపిక్స్‌లో పాల్గొనే అవకాశం రాగా, బరిలోకి దిగి తమ మహిళల గురించి ప్రపంచానికి తెలియచెప్పే ప్రయత్నం చేసింది. అయితే ఆమె చేసిన పనికి ఒలింపిక్స్‌లో అనర్హత వేటును ఎదుర్కొంది.   
 

Videos

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)