Breaking News

బెయిర్‌స్టో ఊచకోత.. ప్రపంచ టాప్‌ బౌలర్‌కు చుక్కలు

Published on Tue, 01/06/2026 - 08:32

సౌతాఫ్రికా టీ20 లీగ్‌ 2025-26లో సన్‌రైజర్స్‌ ఈస్ట్రన్‌కేప్‌ ఆటగాడు, ఇంగ్లండ్‌ వెటరన్‌ బ్యాటర్‌ జానీ బెయిర్‌స్టో చెలరేగిపోయాడు. ప్రిటోరియా క్యాపిటల్స్‌తో నిన్న (జనవరి 5) జరిగిన మ్యాచ్‌లో 45 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో అజేయమైన 85 పరుగులు చేశాడు.

ఈ ఇన్నింగ్స్‌లో బెయిర్‌స్టో విధ్వంసం​ 12వ ఓవర్‌లో పతాక స్థాయికి చేరింది. ప్రపంచ టాప్‌ స్పిన్నర్‌ కేశవ​్‌ మహారాజ్‌ వేసిన ఆ ఓవర్‌లో బెయిర్‌స్టో పూనకం వచ్చినట్లు ఊగిపోయాడు. వరుసగా మూడు సిక్సర్లు, తర్వాత ఒక ఫోర్, ఆపై రెండు భారీ సిక్సర్లు బాది 34 పరుగులు పిండుకున్నాడు. సౌతాఫ్రికా టీ20 లీగ్‌ చరిత్రలోనే ఇది అత్యంత ఖరీదైన ఓవర్‌గా నిలిచింది.  

ఈ మ్యాచ్‌లో బెయిర్‌స్టోతో పాటు మరో ఈస్ట్రన్‌కేప్‌ ఆటగాడు క్వింటన్‌ డికాక్‌ కూడా చెలరేగిపోయాడు. 41 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో అజేయమైన 79 పరుగులు చేశాడు. ఫలితంగా ప్రిటోరియా క్యాపిటల్స్‌ నిర్దేశించిన 177 పరుగుల లక్ష్యాన్ని ఈస్ట్రన్‌కేప్‌ 14.2 ఓవర్లలో వికెట్‌ కోల్పోకుండా ఛేదించింది. ఈ గెలుపుతో ఈస్ట్రన్‌కేప్‌ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరింది.  

క్యాపిటల్స్‌ ఇన్నింగ్స్‌లో కాన్నర్‌ ఎస్టర్‌హ్యూజన్‌ (52) అర్ద సెంచరీతో రాణించగా.. ఆఖర్లో షెర్ఫాన్‌ రూథర్‌ఫోర్డ్‌ (22 బంతుల్లో 47 నాటౌట్‌; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) అలరించాడు. మిగతా ఆటగాళ్లలో పార్సన్స్‌ (18), విహాన్‌ లుబ్బే (21) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. ఈస్ట్రన్‌కేప్‌ బౌలర్లలో నోర్జే 3, ఆడమ్‌ మిల్నే 2, సిపామ్లా, గ్రెగరీ తలో వికెట్‌ తీశారు.

 

Videos

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)