Breaking News

లిట్టన్‌ దాస్‌ సూపర్‌ క్యాచ్‌.. బాబర్‌ ఆజం సిల్వర్‌ డక్‌

Published on Wed, 08/21/2024 - 16:59

పాకిస్తాన్‌ పరిమిత ఓవర్ల కెప్టెన్‌, స్టార్‌ ఆటగాడు బాబర్‌ ఆజం తన పేలవ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. 66 రోజుల సుదీర్ఘ విరామం తర్వాత మైదానంలో తిరిగి అడుగుపెట్టిన బాబర్‌.. తన మార్క్‌ చూపించడంలో విఫలమయ్యాడు.

రావల్పిండి వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో బాబర్‌ ఆజం డకౌట్‌గా వెనుదిరిగాడు. బంగ్లా పేసర్‌ షోరీఫుల్ ఇస్లాం బౌలింగ్‌లో బాబర్‌ వికెట్‌ కీపర్‌కు క్యాచ్‌ ఇచ్చి ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరాడు. రెండు బంతులు ఆడిన బాబర్‌ పరుగులేమి చేయకుండా సిల్వర్‌ డక్‌గా వెనుదిరిగాడు. 

పాక్‌ ఇన్నింగ్స్‌ 8 ఓవర్‌ వేసిన షోరిఫుల్ రెండో బంతిని లెగ్‌ స్టంప్‌ దిశగా బ్యాక్‌ లెంగ్త్‌ డెలివరీని ఆజంకు సంధించాడు. ఈ క్రమంలో ఆజం డౌన్‌ ది లెగ్‌ సైడ్‌ ఆడటానికి ప్రయత్నించాడు. అయితే బంతి ఎడ్జ్‌ తీసుకుని వికెట్‌ కీపర్‌ దిశగా వెళ్లింది.

ఈ క్రమంలో వికెట్‌ కీపర్‌ లిట్టన్‌ దాస్‌ అద్భుతమైన డైవింగ్‌ క్యాచ్‌ను అందుకున్నాడు. లిట్టన్‌ దాస్‌ క్యాచ్‌ చూసిన బాబర్‌ బిత్తర పోయాడు. ఇందుకు సబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

అంతకుముందు ఈ ఏడాది జరిగిన టీ20 వరల్డ్‌కప్‌లోనూ బాబర్‌ ఆజం దారుణ ప్రదర్శన కనబరిచాడు. ఇప్పుడు టెస్టుల్లో కూడా అంతే. ఇక పాక్‌-బంగ్లా తొలి టెస్టు వర్షం కారణంగా ఆలస్యంగా ప్రారంభమైంది. మొదటి ఇన్నింగ్స్‌లో పాకిస్తాన్‌ 21 ఓవర్లకు 3 వికెట్లు కోల్పోయి 81 పరుగులు చేసింది.

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)