Breaking News

వరల్డ్‌కప్‌లో దారుణ ప్రదర్శన.. పాకిస్తాన్‌ కెప్టెన్సీకి బాబర్‌ ఆజం గుడ్‌బై..!

Published on Sat, 11/11/2023 - 16:35

వన్డే వరల్డ్‌కప్‌-2023లో సెమీస్‌ రేసు నుంచి పాకిస్తాన్‌ నిష్కమ్రిచించడం దాదాపు ఖాయమైంది. ఈ మెగా టోర్నీలో భాగంగా ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో టాస్‌ ఓడిపోవడంతో పాక్‌ సెమీస్‌ ఆశలు ఆవిరయ్యాయి. న్యూజిలాండ్‌ను అధిగమించి పాక్‌ సెమీస్‌కు వెళ్లాలంటే ఈ మ్యాచ్‌లో 287 పరుగులతో గెలవడం లేదంటే.. ఇంగ్లండ్‌ విధించిన ఎంతటి లక్ష్యాన్నైనా 2.5 ఓవర్లలోపు ఛేదించాలి.

ఒక వేళ పాకిస్తాన్‌ మొదటి బ్యాటింగ్‌ చేసి ఉంటే సెమీస్‌కు చేరే చిన్నపాటి ఛాన్స్‌ ఉండేది.  కానీ ఇప్పుడు ఇంగ్లండ్‌ తొలుత బ్యాటింగ్‌ చేయడంతో పాక్‌ సెమీస్‌కు చేరే దారులు మూసుకుపోయాయి. కాగా ఈ వరల్డ్‌కప్‌ ముగిసిన పాకిస్తాన్‌ వైట్ బాల్ క్రికెట్ కెప్టెన్సీ నుంచి బాబర్‌ ఆజం తప్పుకోనున్నట్లు తెలుస్తోంది.

జియో న్యూస్‌ రిపోర్ట్స్‌ ప్రకారం.. తన స్వదేశానికి వెళ్లాక పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మెన్‌తో తన రాజీనామా విషయంపై చర్చించనున్నట్లు సమాచారం. కాగా ఈ టోర్నీలో బాబర్‌ బ్యాటర్‌గా కాస్త పర్వాలేదనపించినా.. సారధిగా మాత్రం దారుణంగా విఫలమయ్యాడు.

దీంతో అతడిని కెప్టెన్సీ నుంచి తప్పించాలని సొంత దేశ మాజీ ఆటగాళ్ల నుంచే  వ్యతిరేకత ఎదురైంది.  ఈ క్రమంలో వరల్డ్‌కప్‌లో దారుణ ప్రదర్శనకు నైతిక బాధ్యత వహిస్తూ తప్పుకోవాలని బాబర్‌ భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
చదవండి: IPL 2024: 'వరల్డ్‌కప్‌లో అదరగొట్టాడు.. కచ్చితంగా ఐపీఎల్‌లో కూడా ఆడుతాడు'

Videos

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)