బాబర్‌ ఆజం విధ్వంసం​.. కేవలం 29 బంతుల్లోనే! అయినా పాపం?

Published on Mon, 02/19/2024 - 09:37

పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌-2024 సీజన్‌ను పెషావర్ జల్మీ ఓటమితో ఆరంభించింది. లహోర్‌ వేదికగా క్వెట్టా గ్లాడియేటర్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 16 పరుగుల తేడాతో పెషావర్ పరాజయం పాలైంది. 207 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన జల్మీ నిర్ణీత 20 ఓవర్లలో 6 వి​కెట్లు కోల్పోయి 190 పరుగులకే పరిమితమైంది. ఈ మ్యాచ్‌లో పెషావర్ ఓటమిపాలైనప్పటికీ ఆ జట్టు కెప్టెన్‌ బాబర్‌ ఆజం మాత్రం తన ప్రదర్శనతో అకట్టుకున్నాడు.

ఈ మ్యాచ్‌లో బాబర్‌ అద్బుతమైన హాఫ్‌ సెంచరీతో చెలరేగాడు. కేవలం 29 బంతుల్లోనే తన హాఫ్‌ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఓవరాల్‌గా 42 బంతులు ఎదుర్కొన్న ఆజం.. 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 68 పరుగులు చేశాడు. బాబర్‌ క్రీజులో ఉన్నంతసేపు పెషావర్‌ సునాయసంగా విజయం సాధిస్తుందని అంతా భావించారు.

కానీ 15 ఓవర్‌లో ఆజం కావడంతో ఒక్కసారిగా మ్యాచ్‌ క్వెట్టా మలుపు తిరిగింది. క్వెట్టా బౌలర్లలో అర్బర్‌ ఆహ్మద్‌ రెండు వికెట్లు పడగొట్టగా.. అమీర్‌, వసీం, అకిల్‌ తలా ఒక్క వికెట్‌ సాధించారు. అంతకుముందు బ్యాటింగ్‌ చేసిన క్వెట్టా.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 206 పరుగుల భారీ స్కోర్‌ సాధించింది. క్వెట్టా బ్యాటర్లలో ఓపెనర్లు జాసన్‌ రాయ్(75), షకీల్‌(74) అద్బుతమైన హాఫ్‌ సెంచరీలతో చెలరేగారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)