చరిత్ర సృష్టించిన బాబర్‌ ఆజం

Published on Tue, 08/04/2026 - 13:55

పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదిక‌గా వెస్టిండీస్‌తో జ‌రుగుతున్న రెండో టెస్టులో పాకిస్తాన్ కెప్టెన్ బాబ‌ర్ ఆజం సెంచ‌రీ దిశ‌గా దూసుకుపోతున్నాడు. తొలి టెస్టులో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయిన ఆజం.. ఈ మ్యాచ్‌లో మాత్రం త‌న క్లాస్ చూపిస్తున్నాడు.

 కీల‌క స‌మ‌యంలో క్రీజులోకి వ‌చ్చిన  బాబ‌ర్, మ‌రో సీనియ‌ర్ బ్యాట‌ర్ అబ్దుల్లా షఫీక్‌తో కలిసి జ‌ట్టును భారీ స్కోర్ దిశ‌గా న‌డిపిస్తున్నాడు. రెండో రోజు ఆట ముగిసే స‌మ‌యానికి అత‌డు 86 ప‌రుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఈ క్రమంలో బాబర్ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.

టెస్టుల్లో అత్యధిక హాఫ్ సెంచరీలు సాధించిన నాలుగో పాకిస్తాన్ కెప్టెన్‌గా జావేద్ మియాందాద్ సరసన బాబర్ నిలిచాడు. టెస్టుల్లో కెప్టెన్‌గా బాబర్ ఆజమ్‌కు ఇది 13వ అర్ధశతకం. ఈ జాబితాలో మిస్బా-ఉల్-హక్(35) అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. తర్వాత స్ధానాల్లో ఇమ్రాన్ ఖాన్ (14), ఇంజామామ్-ఉల్-హక్ (14) ఉన్నారు.

టెస్ట్ క్రికెట్‌లో పాకిస్తాన్ కెప్టెన్‌గా కనీసం 1000 పరుగులు చేసిన జాబితాలో అత్యధిక బ్యాటింగ్ సగటు కలిగిన ప్లేయర్‌గా బాబర్ (54.1) నిలిచాడు. ఈ క్రమంలో పాక్ దిగ్గజాలు ఇమ్రాన్ ఖాన్, సలీమ్ మాలిక్, ఇంజామామ్-ఉల్-హక్, మిస్బా-ఉల్-హక్‌లను అధిగమించాడు. ఆజం కెప్టెన్‌గా ఇప్పటివరకు 22 టెస్టుల్లో 54.1 సగటుతో 1894 పరుగులు చేశాడు. ఇందులో 4 సెంచరీలు, 13 అర్ధసెంచరీలు ఉన్నాయి.

పాక్‌ కెప్టెన్‌లగా అత్యుత్తమ టెస్ట్ సగటు కలిగిన బ్యాటర్లు వీరే ( కనీసం 1000 ప్లస్ రన్స్‌):
బాబర్ ఆజమ్ – 54.1

సలీమ్ మాలిక్ – 52.4

ఇమ్రాన్ ఖాన్ – 52.3

ఇంజామామ్-ఉల్-హక్ – 52.1

మిస్బా-ఉల్-హక్ – 51.4

Videos

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)