Breaking News

చరిత్ర సృష్టించిన బాబర్‌ ఆజం.. ప్రపంచంలో తొలి క్రికెటర్‌గా!

Published on Fri, 08/25/2023 - 09:29

పాకిస్తాన్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజం మరో అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. అంతర్జాతీయ వన్డేల్లో 100 ఇన్నింగ్స్‌ల తర్వాత అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా బాబర్‌ ఆజం నిలిచాడు. గురువారం ఆఫ్గానిస్తాన్‌తో జరిగిన రెండో వన్డేతో బాబర్‌ తన వందో ఇన్నింగ్స్‌ను మార్క్‌ను అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో 53 పరుగులతో అదరగొట్టిన ఆజం.. ఈ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు.

బాబర్‌ తన 100 వన్డే ఇన్నింగ్స్‌లలో 5,142 పరుగులు సాధించాడు. ఇప్పటివరకు ఈ రికార్డు దక్షిణాఫ్రికా లెజెండ్‌ హసీం ఆమ్లా పేరిట ఉండేది. ఆమ్లా తన వంద ఇన్నింగ్స్‌లలో 4946 పరుగులు చేశాడు. తాజా మ్యాచ్‌తో ఆమ్లా రికార్డును బాబర్‌ బ్రేక్‌ చేశాడు. బాబర్‌ వన్డే కెరీర్‌లో ఇప్పటివరకు 18 సెంచరీలు, 27 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి.

ఇక అరుదైన ఘనత సాధించిన జాబితాలో బాబర్‌ తర్వాత స్ధానాల్లో వరుసగా ఆమ్లా(4946), వెస్టిండీస్‌ దిగ్గజం వివ్ రిచర్డ్స్(4607), విండీస్‌ కెప్టెన్‌(4436), ఇంగ్లండ్‌ స్టార్‌ జో రూట్‌(4428) కొనసాగుతున్నారు. కాగా ఈ ఫీట్‌ టీమిండియా స్టార్‌ విరాట్‌ కోహ్లికి కూడా సాధ్యపడలేదు.

విరాట్‌ తన 100 వన్డే ఇన్నింగ్స్‌లలో 4230 పరుగులు చేశాడు. ఈ జాబితాలో కోహ్లి తొమ్మిదో స్ధానంలో ఉన్నాడు. ఇక మ్యాచ్‌ విషయానికి.. ఆఫ్గానిస్తాన్‌పై ఒక్క వికెట్‌ తేడాతో పాకిస్తాన్‌ విజయం సాధించింది. దీంతో మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే 2–0తో సిరీస్‌ను పాక్‌ సొంతం చేసుకుంది.
చదవండి: #Bray Wyatt: డబ్ల్యూడబ్ల్యూఈలో తీవ్ర విషాదం.. గుండెపోటుతో సూపర్‌ స్టార్‌ మృతి

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)