Breaking News

'వరల్డ్‌కప్‌లో అదరగొట్టాడు.. కచ్చితంగా ఐపీఎల్‌లో కూడా ఆడుతాడు'

Published on Sat, 11/11/2023 - 15:47

వన్డే వరల్డ్‌కప్‌లో అఫ్గానిస్తాన్‌ సెమీఫైనల్స్‌కు చేరకపోయినప్పటికీ.. తమ అద్బుత ప్రదర్శనతో అందరిని ఆకట్టుకుంది. తమ ఆఖరి లీగ్‌ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాతో పోరాడి అఫ్గానిస్తాన్‌ ఓడింది.  ఈ మెగా టోర్నీలో అఫ్గాన్‌ జట్టుతో పాటు ఆల్ రౌండర్ అజ్మతుల్లా ఒమర్జాయ్‌ కూడా సత్తాచాటాడు. బ్యాటింగ్‌, బౌలింగ్‌లో ఈ అఫ్గాన్‌ ఆల్‌రౌండర్‌ దుమ్ములేపాడు. 

దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో 97 పరుగులతో కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. అంతకుముందు భారత్‌, శ్రీలంకతో మ్యాచ్‌ల్లో ‍కూడా  ఒమర్జాయ్‌ మంచి ప్రదర్శన కనబరిచాడు. ఈ వరల్డ్‌కప్‌లో తొమ్మిది ఇన్నింగ్స్‌లలో 353 పరుగులతో పాటు 7 వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో ఒమర్జాయ్‌పై భారత మాజీ ఆటగాడు ఆకాష్ చోప్రా ప్రశంసల వర్షం కురిపించాడు. ఒమర్జాయ్‌ కచ్చితంగా ఐపీఎల్‌ 2024లో  కాంట్రాక్ట్ పొందుతాడని చోప్రా జోస్యం చెప్పాడు.

"ఒమర్జాయ్‌ అద్భుతమైన ఆల్‌రౌండర్‌. అతడు ఐపీఎల్‌ కాంట్రాక్ట్‌ పొందుతాడని నేను భావిస్తున్నాను. డిసెంబర్‌ 19న జరగనున్న వేలంలో లక్నో ఫ్రాంచైజీ అతడని కొనుగోలు చేసే ఛాన్స్‌ ఉంది. ఎందుకంటే లక్నో సూపర్‌ జెయింట్స్‌ నుంచి రొమారియో షెపర్డ్‌ని ముంబై  ట్రేడింగ్‌ చేసింది.

దీంతో లక్నో ఫ్రాంచైజీలో ఆల్‌రౌండర్‌ కోటా ఖాళీ అయింది. ఈ క్రమంలో ఆ స్ధానాన్ని ఒమర్జాయ్‌తో భర్తీ చేసుకునే అవకాశం ఉందని" తన యూట్యూబ్‌ ఛానల్‌లో చోప్రా పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్‌-2024కు సంబంధించిన మినీ వేలం డిసెంబర్‌ 19న దుబాయ్‌ వేదికగా జరగనుంది.
 

Videos

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)