Breaking News

అండర్‌–19 సారథిగా ఆయుశ్‌

Published on Fri, 05/23/2025 - 04:10

న్యూఢిల్లీ: ఐపీఎల్‌లో అదరగొడుతున్న చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఓపెనర్‌ ఆయుశ్‌ మాత్రే భారత అండర్‌–19 జట్టు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. రాజస్తాన్‌ రాయల్స్‌ తరఫున ఈ సీజన్‌  ఐపీఎల్‌లో అరంగేట్రం చేసి... 35 బంతుల్లోనే సెంచరీతో సంచలనం రేకెత్తించిన 14 ఏళ్ల వైభవ్‌ సూర్యవంశీ కూడా జట్టులో చోటు దక్కించుకున్నాడు. వచ్చే నెలలో భారత అండర్‌–19 జట్టు ఇంగ్లండ్‌లో పర్యటించనుంది. ఇందులో భాగంగా... 5 యూత్‌ వన్డేల సిరీస్‌తో పాటు 2 నాలుగు రోజుల మ్యాచ్‌లు ఆడనుంది. 

అంతకుముందు జూన్‌ 24న ఇంగ్లండ్‌ అండర్‌–19 జట్టుతో 50 ఓవర్ల వార్మప్‌ మ్యాచ్‌ కూడా ఆడనుంది. ఇప్పటికే యువ భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించిన ఆయుశ్, వైభవ్‌పై ఐపీఎల్‌తో మరిన్ని అంచనాలు పెరిగాయి. గతేడాది ఆ్రస్టేలియా అండర్‌–19 జట్టుపై వైభవ్‌ సెంచరీతో ఆకట్టుకోగా... 17 ఏళ్ల ఆయుశ్‌ 9 ఫస్ట్‌ క్లాస్‌ మ్యాచ్‌లు, 7 లిస్ట్‌ ‘ఎ’ మ్యాచ్‌లాడి 962 పరుగులు చేశాడు. 

ముంబై వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ అభిజ్ఞాన్‌ కుందు ఈ జట్టుకు వైస్‌ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. గతేడాది ఆస్ట్రేలియా అండర్‌–19 జట్టుతో రెండు మ్యాచ్‌ల యూత్‌ టెస్టు సిరీస్‌ 16 వికెట్లతో అదరగొట్టిన కేరళ లెగ్‌స్పిన్నర్‌ మొహమ్మద్‌ ఇనాన్‌తో పాటు పంజాబ్‌ ఆఫ్‌స్పిన్నర్‌ అన్‌మోల్‌జీత్‌ సింగ్‌ కూడా జట్టులో చోటు దక్కించుకున్నారు. స్టాండ్‌బై ఆటగాళ్ల జాబితాలో హైదరాబాద్‌ వికెట్‌కీపర్‌ రాపోలు అలంకృత్‌కు స్థానం లభించింది. 

భారత అండర్‌–19 జట్టు: ఆయుశ్‌ మాత్రే (కెపె్టన్‌), వైభవ్‌ సూర్యవంశీ, విహాన్‌ మల్హోత్రా, మౌల్యరాజ్‌సింగ్, రాహుల్‌ కుమార్, అభిజ్ఞాన్‌ కుందు, హర్‌వంశ్‌ సింగ్, అంబరీశ్, కనిష్క్ చౌహాన్, ఖిలాన్‌ పటేల్, హెనిల్‌ పటేల్, యుధజిత్‌ గుహ, ప్రణవ్‌ రాఘవేంద్ర, మొహమ్మద్‌ ఇనాన్, ఆదిత్య రాణా, అన్‌మోల్‌జీత్‌ సింగ్‌. 
స్టాండ్‌బై ప్లేయర్లు: నమన్‌ పుష్పక్, దీపేశ్, వేదాంత్‌ త్రివేది, వికల్ప్‌ తివారీ, రాపోలు అలంకృత్‌. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)