Breaking News

Axar Patel: ‘ఆర్మ్‌ బౌలర్‌’ కప్‌ అందిస్తాడా?

Published on Fri, 03/14/2025 - 20:04

క్రికెట్‌ అభిమానులను అలరించేందుకు ఐపీఎల్‌ 18వ సీజన్‌ రెడీ అవుతోంది. పొట్టి ఫార్మాట్‌లో క్రికెట్‌ లవర్స్‌ను బాగా ఆకట్టుకున్న ఈ మెగా టోర్నమెంట్‌ మార్చి 22 నుంచి ప్రారంభమవుతోంది. 10 టీమ్‌లు బరిలో​కి దిగేందుకు సమాయత్తమవుతున్నాయి. ఐపీఎల్‌ ఆరంభం నుంచి ఉన్న బెంగళూరు రాయల్‌ చాలెంజర్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌, పంజాబ్‌ కింగ్స్‌ ఇప్పటివరకు కప్‌ కొట్టలేకపోయాయి. మధ్యలో వచ్చిన లక్నో సూపర్‌ జెయింట్స్‌ కూడా ఇంకా టైటిల్‌ దక్కించుకోలేదు. కొత్త కెప్టెన్లతో బరిలోకి దిగుతున్న ఈ నాలుగు జట్లు ఈసారైనా ఐపీఎల్‌ కప్‌ అందుకుంటాయా, లేదా అనేది ఆసక్తికరంగా మారింది.

న్యూ రోల్‌లో రాణిస్తాడా?
టోర్నమెంట్‌కు వారం రోజుల ముందు ఢిల్లీ క్యాపిటల్స్‌ ఫ్రాంచైజీ తమ టీమ్‌ కెప్టెన్‌ (Team Captain) ఎవరనేది ప్రకటించింది. ఆల్‌రౌండర్‌ అక్షర్‌ పటేల్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేసినట్టు అధికారికంగా వెల్లడించింది. కేఎల్‌ రాహుల్‌ సారథ్య బాధ్యతలు తీసుకోవడానికి సుముఖంగా లేకపోవడంతో అక్షర్‌ పటేల్‌కు అరుదైన అవకాశం లభించింది. ఇప్పటివరకు ఆల్‌రౌండర్‌గా రాణించిన ఈ లెఫ్ట్‌ ఆర్మ్‌ స్పిన్నర్‌ కమ్‌ బ్యాటర్‌.. జ‌ట్టు నాయకుడిగా ఎలాంటి ముద్ర వేస్తాడనేది చూడాలి. ఆటగాడిగా తానేంటో నిరూపించుకున్న అక్షర్‌ కెప్టెన్‌గా జట్టును ఎలా నడిపిస్తాడేనన్నది ఆసక్తికరంగా మారింది.

పొట్టి ఫార్మాట్‌లో రాణిస్తూ..
గత కొంతకాలంగా పొట్టి ఫార్మాట్‌లో అక్షర్‌ పటేల్‌ (Axar Patel) స్థిరంగా రాణిస్తున్నాడు. టీమిండియాలో అవకాశం వచ్చిన ప్రతిసారీ దాన్ని సద్వినియోగం చేసుకునేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నాడు. తాజాగా ముగిసిన ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీలోనూ జట్టు విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. బ్యాటింగ్‌  ఆర్డర్‌లో ప్రమోషన్‌ పొందడమే కాకుండా మెప్పు పొందేలా ఆడాడు. ముఖ్యంగా మిడిల్‌ ఓవర్లలో స్పిన్నర్లను దీటుగా ఎదుర్కొంటూ పరుగులు రాబడుతూ జట్టుకు ప్రయోజనకరంగా మారాడు. చాంపియన్స్‌ ట్రోఫీలో 5 వికెట్లు పడగొట్టడంతో పాటు 109 పరుగులు చేసి తన విలువ చాటుకున్నాడు.

ఐపీఎల్‌లో అదుర్స్‌
2014లో ఐపీఎల్‌లో అరంగ్రేటం చేసిన అక్షర్‌ పటేల్‌ ఇప్పటివరకు 150 మ్యాచ్‌లు ఆడాడు. 21.47 సగటు, 130.88 స్టైక్‌ రేటుతో 1653 పరుగులు చేశాడు. గత రెండు సీజన్లలో అద్భుతంగా రాణించాడు. గత ఐపీఎల్‌లో 235 పరుగులు చేయగా, 2023లో 283 పరుగులు సాధించాడు. ఈ రెండు ఎడిషన్లలోనూ 11 వికెట్ల ప్రదర్శన చేశాడు. ఐపీఎల్‌లో ఇప్పటివరకు మొత్తం 123 వికెట్లు తన ఖాతాలో వేసుకు​న్నాడు. ఫీల్డింగ్‌లోనూ చురుకుదనం ప్రదర్శించాడు. బౌలింగ్‌కు కాస్త పేస్‌ జోడించి ‘ఆర్మ్‌ బాల్‌’తో నేరుగా వికెట్లపైకి సంధిస్తూ వికెట్లు చేజిక్కించుకోవడం అక్షర్‌ పటేల్‌ స్పెషాలిటీ. తన మ్యాజిక్‌తో ఈ ఐపీఎల్‌లో ఎలాంటి ఫలితం రాబతాడో చూడాలి మరి.

చ‌ద‌వండి: 'అక్ష‌రా'ల అమూల్యం., టీమిండియాలో స్థానం సుస్థిరం

క్యాపిటల్స్‌కు కప్‌ తెస్తాడా?
ఢిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్‌గా ఎంపికైన అక్షర్‌ పటేల్‌ ముందు ఇప్పుడు పెద్ద లక్షమే ఉంది. ఇప్పటివరకు డీసీ ఒక్కసారి కూడా ఐపీఎల్‌ టైటిల్‌ గెలవలేదు. 2020లో దుబాయ్‌లో జరిగిన టోర్నమెంట్‌లో ఫైనల్‌ వరకు  చేరుకుని ముంబై ఇండియన్స్‌ చేతిలో పరాజయం పాలైంది. గత సీజన్‌లో ఆరో స్థానానికి పరిమితమైంది. మరి ఈసారి ఢిల్లీ క్యాపిటల్స్‌ను (Delhi Capitals) అక్షర్‌ పటేల్‌ అంతకంటే మెరుగైన స్థానంలో ఉంచుతాడా, టైటిల్‌ గెలుస్తాడా అనేది వేచి చూడాల్సిందే. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)