Breaking News

'వెస్టిండీస్‌ టూర్‌.. భారత జట్టులోకి రీ ఎంట్రీ ఇవ్వాలనుకుంటున్న'

Published on Mon, 06/19/2023 - 13:50

టీమిండియా వచ్చే నెలలో విండీస్‌ పర్యటనకు వెళ్లనున్న సంగతి తెలిసిందే. ఈ టూర్‌లో భాగంగా భారత జట్టు రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడనుంది. జూలై 12న డొమెనికా వేదికగా జరగునున్న తొలి టెస్టుతో భారత పర్యటన ప్రారంభం కానుంది. ఇక విండీస్‌ టూర్‌కు భారత జట్టును బీసీసీఐ జూన్‌ 27న ప్రకటించనుంది. కాగా విండీస్‌ టూర్‌ ముగిసిన అనంతరం భారత జట్టు ఐ‍ర్లాండ్‌కు వెళ్లనుంది. అక్కడ మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఐరీష్‌ జట్టుతో భారత్‌ తలపడనుంది.

మళ్లీ వస్తా..
ఇక వరుస సిరీస్‌ల నేపధ్యంలో మళ్లీ భారత జట్టులోకి రీ ఎంట్రీ ఇస్తానని యువ పేసర్‌ అవేశ్ ఖాన్ ఆశాభావం వ్యక్తం చేశాడు. "భారత జట్టులో ఉండాలని నేను ఆశిస్తున్నాను. కానీ అది నా చేతిలో లేదు. ప్రతీ ఒక్కరి కెరీర్‌లో ఎత్తు పల్లపల్లాలు ఉంటాయి. నేను రీ ఎంట్రీ ఇచ్చేందుకు అన్ని విధాల ప్రయత్నిస్తాను" అని ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌తో అవేశ్ ఖాన్ పేర్కొన్నాడు.

గతేడాది భారత జట్టు తరపున అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన అవేష్‌ ఖాన్‌.. పెద్దగా రాణించకపోవడంతో జట్టులో చోటు కోల్పోయాడు. ఇప్పటివరకు టీమిండియా తరపున ఐదు వన్డేలు, 15 టీ20లు ఆడిన అవేష్‌ ఖాన్‌ వరుసగా 3, 13 వికెట్లు పడగొట్టాడు. అదే విధంగా ఈ ఏడాది ఐపీఎల్‌ సీజన్‌లో కూడా అంతగా రాణించలేకపోయాడు ఐపీఎల్‌ 2023లో 9 మ్యాచ్‌లు ఆడిన అతడు కేవలం 8 వికెట్లు మాత్రమే సాధించాడు.
చదవండి: CWC Qualifier 2023: కోహ్లి, బాబర్‌ ఆజమ్‌లను మించిపోయిన వెస్టిండీస్‌ కెప్టెన్‌

Videos

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)